రైలు ప్రయాణం పూర్తి సురక్షితంగా మారేందుకు రైల్వేశాఖ నిరంతరం శ్రమిస్తుంటుంది.రైలు పట్టాలు తప్పడం వంటి ఘటనలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతుంటుంది.
ఎలాంటి సమస్య వచ్చినా దానిని ముందుగా ఎదుర్కోనేందుకు రైల్వేశాఖ సిద్ధంగా ఉంటుంది.ప్రయాణికులకు ప్రాణ నష్టం జరగకుండా చూస్తుంది.
రైలు ప్రమాదాలను సున్నాకి తగ్గించేందుకు అనేక స్థాయిల్లో పనులు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్) లో పనిచేస్తున్న ఇంజనీర్లు నూతన సాంకేతికతను కనిపెట్టారు.
దీని ద్వారా రైలు ట్రాక్‌కు ఎక్కడ పగుళ్లు ఏర్పడినా ఆ సమాచారం వెంటనే రైల్వేశాఖకు అందుతుంది.
అధికారులు తమ మొబైల్ ఫోన్ల కనిపించే ఈ సందేశాన్నిచూసి, వెంటనే అలెర్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
దీంతో రైలు ప్రమాదాలు ఖచ్చితంగా తగ్గుతాయి.ప్రస్తుతానికి ఢిల్లీ మెట్రో రైలు పట్టాల విషయంలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
ఇప్పటికే విజయవంతమైన ట్రయల్ కూడా జరిగింది.రాబోయే కాలంలో బొటానికల్ గార్డెన్, కల్కాజీ మందిర్ స్టేషన్ మధ్య మెట్రో రైలు పట్టాలపై ఈ సాంకేతికతను వినియోగించనున్నారు.
ఈ నేపధ్యంలో భారతీయ రైల్వే ట్రాక్‌లపై కూడా దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.చలికాలంలో రైలు పట్టాలపై పగుళ్లు లాంటివి ఏర్పడటం ఎక్కువగా కనిపిస్తుంది.

దీంతో రైలు ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.ఈ సమస్యను పరిష్కరించడానికి సీఈఎల్ ఇంజనీర్లు ఇప్పుడు బ్రోకెన్ రైల్ డిటెక్షన్ సిస్టమ్‌ని అభివృద్ధి చేశారు.ట్రాక్‌లలో ప్రతీ 500 మీటర్ల దూరంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.దీని పరిధిలోకి వచ్చే ట్రాక్ పగిలినా, పగుళ్లు వచ్చినా వెంటనే రైల్వే అధికారుల మొబైల్‌కు ఈ సందేశం చేరుతుంది.
దీంతో ట్రాక్‌లను సకాలంలో మరమ్మతు చేయగలుగుతారు.ఆ సమయంలో ఏదైనా రైళ్లు ఆ ప్రాంతం గుండా వెళుతుంటే వాటిని ముందుగానే స్టేషన్లలో నిలిపివేస్తారు.
ఇది ప్రమాదాన్ని నివారించడానికి దోహదపడుతుంది.ఈ నూతన సాంతకేతిక గురించి సీఈఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చేతన్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ, ఇంజనీర్లు ఆత్మనిర్భర్ భారత్ కింద బీఆర్‌డీఎస్ వ్యవస్థను అభివృద్ధి చేశారని, తద్వారా రైల్వే అధికారులు రైల్వే ట్రాక్‌లనూ పగుళ్లు ఏర్పడిన వెంటనే సమాచారం అందుకోగలుగుతారని చెప్పారు.
ఈ నూతన సాంకేతిక విధానంలో ట్రాక్ పగిలితే వెంటనే ఆ విషయం అధికారుల మొబైల్ ఫోన్‌లకు మెసేజ్ రూపంలో చేరుతుంది.ట్రాక్‌ను పగులగొట్టి రైలు ప్రమాదం లాంటి పరిస్థితిని సృష్టించడానికి సంఘ వ్యతిరేక వర్గం ప్రయత్నిస్తే, రైల్వే యంత్రాంగం దానిని గమనించి వెంటనే అప్రమత్తం అయ్యేందుకు వీలు చిక్కుతుంది.
రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చడంలో ఈ వ్యవస్థ ఒక విప్లవాత్మక చర్యగా పరిగణిస్తున్నారు.
.






