మనుషులకంటే జంతువులే నయం,చక్కగా చేతులు శుభ్రం చేసుకుంటున్న చింపాంజీ

కరోనా వైరస్ అనేది అపరిశుభ్రత వల్లే వస్తుంది అని, అందుకే తరచూ చక్కగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అంటూ ఎంతమంది చెప్పినా మనుషులు ఎవరూ పెద్దగా పాటించడం లేదు.

కానీ ఈ చింపాంజీ మాత్రం ఎంతో శ్రద్దగా తన చేతులు సుబ్బు తో శుభ్రం చేసుకుంటూ వైరస్ తన దరి చేరకుండా జాగ్రత్తలు పాటిస్తుంది.

దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడం తో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.దీనితో ఈ వీడియో కు తెగ లైక్ లు, కామెంట్లు వస్తున్నాయి.

యూకేలోని ఓ జూలో ‘సాండ్రా’ అనే ఓ చింపాంజీ ఉంటోంది.అయితే ఇటీవల కరోనా వైరస్ ప్రబలడం తో జూ సిబ్బంది తరుచూ చేతులు కడుక్కుంటుంది.

అయితే దానిని గమనించిన ఆ చింపాంజీ మనుషులు చేసే ప్రతి పనిని ఫాలో అయ్యే అది ఈ పని కూడా చేయడం మొదలు పెట్టింది.ఓ టబ్ వద్దకు వచ్చి సబ్బు చేతులకు రాసుకొని బ్రెష్‌తో జాగ్రత్తగా శుభ్రం చేసుకుంది.

Advertisement

మనుషులు కూడా చేయని విధంగా ఎంతో శ్రద్ధగా చేతులు శుభ్రం చేసుకుంటున్న వీడియోను ట్వీట్‌ చేశారు.దీంతో ఈ వీడియోకు ఇప్పటి వరకూ 3.2 మిలియన్ల వ్యూస్‌ రాగా వందల్లో కామెంట్లు వస్తున్నాయి.దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

జంతువులను చూసిన తర్వాత అయినా మనుషులు శుభ్రతను పాటించాలి అంటూ సూచిస్తున్నారు.మొత్తానికి కరోనా పుణ్యమా అని మనుషుల తో పాటు ఇలా జంతువులూ కూడా శుభ్రంగా చేతులు కడుక్కొనే పనిలో ఉన్నాయి అన్నమాట.

చింపాంజీ చేతులు శుభ్రం చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా షేక్ చేస్తుంది.కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 9 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా,45 వేల మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు నమోదైన మరణాల్లో అత్యధికంగా ఇటలీ లోనే 12 వేల మంది మృతి చెందారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు