పోలీసులకే కుచ్చుటోపీ పెట్టి రూ. 25 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు !

రోజురోజుకి సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.సామాన్యులు , ప్రముఖులు అన్న తేడా లేకుండా మోసం చేస్తున్నారు.

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పలువురు పోలీసు అధికారుల ఫేస్ ‌బుక్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి మోసాలు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్‌ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కారు.

ఆన్ ‌లైన్ ట్రేడింగ్‌లో డబ్బులు కడితే ఆదాయం వస్తుందని నమ్మించి.ఏకంగా రూ.25లక్షలకు కాజేశారు.రాజంపేటకు చెందిన కానిస్టేబుల్‌ ఈశ్వర్‌రెడ్డి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో కొందరు నమ్మించారు.

ఆర్నెళ్ల నుంచి జేఎస్ క్లబ్‌, యోకో క్లబ్‌ల ద్వారా ఆన్‌ లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో మాయ మాటలు చెప్పి 25 లక్షల రూపాయలు కట్టించుకున్నారు.ఆ తరువాత అసలు విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

విచారణ జరుపుతున్న సమయంలో తెలంగాణలో ఇలాంటి మోసానికి సంబంధించి చైనాకు చెందిన యాహూవో, రాజస్థాన్‌ కి చెందిన ధీరజ్‌సర్కార్‌, అంకిత్‌కపూర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.అక్కడి నుంచి రాజంపేట పోలీసులు ఈ నెల 2న ఆ ముగ్గురిని రాజంపేటకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు.

మోసాలకు పాల్పడ్డ ఆన్ ‌లైన్‌ ట్రేడింగ్‌ కంపెనీలను హోల్డ్‌ లో పెట్టారని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు