20 కిలోల చోరీ.. బంగారం కాదండోయ్!

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటుండటంతో ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడే కొనేస్తున్నారు జనం.

ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలు అది ఎక్కడ దొరుకుంతుందా అని చూస్తున్నారు.

కాగా ముంబై, యూపీ, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో ఉల్లి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి.అయితే తాజాగా హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఇక్కడి జనం అవాక్కవుతున్నారు.

దోమలగూడలో నడిరోడ్డు పక్కన ఓ వ్యాపారి కూరగాయల బండిలో ఉల్లిని ఉంచారు.కాగా ఉదయం వచ్చి చూసే సరికి దుకాణంలో ఉల్లి లేదు.

దీంతో పోలీసులను ఆశ్రయించారు ఆ వ్యాపారి.కాగా సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి బైకుపై వచ్చి కూరగాయల దుకాణంలో నుంచి 20 కిలోల ఉల్లిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.

Advertisement

ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా ఉల్లి దొంగలు తయారయ్యారని వారు తెలిపారు.

కాగా తమ దుకాణాలకు రక్షణ ఇవ్వాల్సిందిగా పలువురు దుకాణదారులు పోలీసులను కోరారు.బంగారం చోరీ లాగా ఉల్లిపాయలు కూడా చోరీ చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా ఉల్లి కోసం ఇంకా ఎలాంటి ఘటనలు చూడాల్సి వస్తుందో అని వారు అంటోన్నారు.

Advertisement

తాజా వార్తలు