కొనసాగుతున్న కరోనా విజృంభణ !

తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది.రోజూ రెండు వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

దీంతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఒకరి నుంచి మరొకరికి వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.

అన్ లాక్-4తో రాష్ట్రంలో కేసుల సంఖ్య మరింత పెరిగిందని.వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేస్తే బాగుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,54,880కి చేరింది.నిన్న ఒక్కరోజే 10 మంది ప్రాణాలు కోల్పోగా.మరణించిన వారి సంఖ్య 950కి చేరింది.2,458మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.దీంతో 1,21,955 మంది ఇప్పటివరకూ కరోనా బారిన పడి కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 32,005 యాక్టివ్ కేసులుండగా.వీరిలో 25,050 మంది హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62,234 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ వెల్లడించింది.నిన్న ఒక్కరోజే జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 331, రంగారెడ్డి 184, మేడ్చల్ మల్కాజిగిరి 150, కరీంనగర్ 121 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?
Advertisement

తాజా వార్తలు