అధ్యక్షుడైన సురేష్‌బాబు

తెలంగాణ నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో ఆంధ్రాకు చెందిన ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు అధ్యక్షుడిగా గెలుపొందారు.

నిన్న జరిగిన ఈ ఎన్నికల్లో పలువురు నిర్మాతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈసారి ఆంధ్రాకు చెందిన పలువురు చిన్న నిర్మాతలు తెలంగాణకు చెందిన నిర్మాతను ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని భావించినట్లుగా ప్రచారం జరిగింది.

నలుగురు బడా నిర్మాతలు చిన్న నిర్మాతలను బతకనివ్వడం లేదనే ఉద్దేశ్యంతో తెలంగాణకు చెందిన నిర్మాతకు అధ్యక్ష పదవి కట్టబెట్టాని చూశారు.అయితే చివరి నిమిషంలో ఏమైందో ఏమో కాని సురేష్‌బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

నట్టి కుమార్‌, టి.ప్రసన్న కుమార్‌ల ప్యానల్‌తో పోటీ పడ్డ సురేష్‌బాబు ప్యానల్‌ ఘన విజయం సాధించింది.అధ్యక్షుడిగా సురేష్‌బాబు ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా దిల్‌రాజు ఎన్నిక అయ్యాడు.

Advertisement

ఆనంద్‌ సినీ సర్వీస్‌ కిరణ్‌, రమేష్‌లు కూడా ఉపాధ్యక్షులుగా ఎన్నిక అయ్యారు.పంపిణీదారుల విభాగానికి భరత్‌ చౌదరి, ఎగ్జిబ్యూటర్స్‌ విభాగానికి నారాయణ బాబు, నిర్మాతల సెక్టర్‌కు ఆర్‌.

కె.గౌడ్‌, స్టూడియో సెక్టారుకు నాగినీడు చైర్మన్లుగా ఎన్నిక అయ్యారు.అత్యధిక సభ్యులను గెలుసుకున్న సురేష్‌బాబు ప్యానల్‌ తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ బాధ్యతలను నిర్వహించనుంది.

Advertisement

తాజా వార్తలు