పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ సలార్, స్పిరిట్ వంటి చిత్రాలతో బిజీ కానున్నారు.ఈ సినిమాలతో పాటు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు సందడి చేయనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీలా,మాళవికా మోహనన్ వంటి వారి పేర్లు వినపడుతున్నాయి.ఇక పోతే మరొక హీరోయిన్ గా అనుష్క నటిస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో అనుష్క మెయిన్ హీరోయిన్ పాత్రలో నటించబోతున్నారని టాలీవుడ్ సమాచారం.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్క జోడికి విపరీతమైన క్రేజ్ ఉంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో బిల్లా, మిర్చి, బాహుబలి వంటి చిత్రాలలో నటించారు.ఈ విధంగా వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ కావడంతో ఈ జంటకు విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పాలి.
అయితే వీరికి ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని డైరెక్టర్ మారుతి మరోసారి తన రాజా డీలక్స్ సినిమా కోసం ప్రభాస్ సరసన అనుష్కని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే ప్రభాస్ అనుష్క అభిమానులకు పండగ అని చెప్పాలి.







