ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో కీరా దోసకాయలను ఎగుమతి చేసే దేశంగా భారత్ ఆవిర్భవించిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.భారతదేశం ఏప్రిల్-అక్టోబర్ (2020-21) కాలంలో USD 114 మిలియన్ల విలువైన 1,23,846 మెట్రిక్ టన్నుల కీరా దోసకాయలను ఎగుమతి చేసింది.
ప్రపంచవ్యాప్తంగా గెర్కిన్స్ లేదా కార్నికాన్స్ అని పిలిచే పిక్లింగ్ దోసకాయలు.వ్యవసాయ-ప్రాసెస్ చేసే ఉత్పత్తి ఎగుమతుల కోసం భారతదేశం గత ఆర్థిక సంవత్సరంలో USD 200 మిలియన్ల మార్కును అధిగమించింది.2020-21లో భారతదేశం 223 మిలియన్ డాలర్ల విలువైన 2,23,515 మెట్రిక్ టన్నులు కీరా దోసకాయలను ఎగుమతి చేసింది.
వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వాణిజ్య శాఖ ఆదేశాలను అనుసరించి, వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, ప్రపంచ మార్కెట్‌లో ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, ఆహార భద్రత నిర్వహణ వ్యవస్థకు కట్టుబడి ఉండటానికి చర్యలు తీసుకుంది.
ప్రాసెసింగ్ యూనిట్లలో పలు కార్యక్రమాలు చేపట్టారు.కీరా దోసకాయలను రెండు వర్గాల కింద ఎగుమతి చేస్తారు.వీటిని వెనిగర్ లేదా ఎసిటిక్ యాసిడ్ వినియోంగం ద్వారా భద్రపరుస్తారు.కీరా దోసకాయలు తాత్కాలికంగా సంరక్షిస్తాయి.
కీరాదోసకాయల సాగు, ప్రాసెసింగ్, ఎగుమతి భారతదేశంలో 1990 లలో కర్ణాటకలో చిన్న స్థాయిలో ప్రారంభమైంది.ఆ తరువాత పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్.
తెలంగాణలకు విస్తరించింది.ప్రపంచానికి అవసరమైన కీరా దోసకాయలో 15 శాతం భారతదేశంలోనే ఉత్పత్తి అవుతోంది.







