ఇటీవల లోక్ సభలో భారీ భద్రత వైఫల్యం బయటపడటం తెలిసిందే.కొంతమంది దుండగులు స్మోక్ గన్స్ తో ప్రేక్షకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకి.
ఎంపీలు కూర్చున్న టేబుల్స్ పైనుంచి దూకి.భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది.
పార్లమెంటులో స్మోక్ గన్ తో పసుపు రంగు పొగను వదిలారు.చివరకు వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో నేడు పార్లమెంటులో భద్రతా వైఫల్యం పై విపక్షాలు ఆందోళన చేపట్టాయి.దీంతో 141 మంది విపక్షాల సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఎంపీల సస్పెన్షన్ వేటు విషయం ఇండియా కూటమి ఖండించింది.దీనిపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా( Amith shah ) సభలో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge ).డిమాండ్ చేశారు.సస్పెన్షన్ కి వ్యతిరేకంగా ఈనెల 22న దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే మరోపక్క పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్ష ఇండియా కూటమి ఎన్నికలలో గెలవడానికి ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేయడం తెలిసిందే.మోదీ ప్రభుత్వాన్ని( Narendra Modi ) గద్దె దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి పార్టీలు పనిచేస్తున్నాయి.
అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేనీ ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.