కరోనా సెకెండ్ వేవ్ నుంచి తేరుకునేలోపే మళ్లీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాల ప్రజలనూ, ప్రభుత్వాలనూ హడలెత్తిస్తోంది.గత నెల దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ బయట పడింది.
ఈ కొత్త వేరియంట్ నుంచి పెద్ద ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఎప్పుడో హెచ్చరించింది.దీంతో ప్రపంచదేశాలు అప్రమత్తమైనప్పటికీ.
ఇప్పటికే 60కిపైగా దేశాలకు ఒమిక్రాన్ విస్తరించేసింది.భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్‌పై రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటపడింది.
ఇంతకీ ఆ విషయం ఏంటంటే.సామాన్య వ్యక్తులతో పోలిస్తే ఊబకాయులకు ఒమిక్రాన్వేరియంట్ వచ్చే రిస్క్ రెండు రేట్లు ఎక్కువట.
అందువల్లనే డబ్ల్యూహెచ్‌ఓ ఊబకాయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మరి ఒమిక్రాన్ ముప్పు నుంచి తమను తాము రక్షించుకోవాలంటే ఊబకాయ బాధితులు ఏయే ఆరోగ్య నియమాలను పాటించాలో చూసేయండి.మొదట డైట్‌లో పోషకాహారం చేర్చుకోవాలి.తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నట్స్, చేపలు వంటివి తీసుకోవాలి.
ఫాస్ట్ ఫుడ్స్, బేక్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్‌ను ఎవైడ్ చేయాలి.వాటర్ ఎక్కువగా సేవించాలి.
ప్రతి రోజు గ్రీన్ టీ లేదా ఏదో ఒక హెర్బల్ టీనీ సేవించాలి.

సోడా మరియు కూల్ డ్రింక్స్ అసలు తాగరాదు.అలాగే ఊబకాయులు రోజుకు కనీసం ముప్పై రోజుల పాటు ఖచ్చితంగా వ్యాయామాలు చేయాలి.కుదిరితే వారానికి ఒక రోజు అయినా ఉపవాసం చేయాలి.
రోజుకు ఏడు గంటల పాటు నిద్రించాలి.ధూమపానం, మద్యపానం అలవాట్లను వదులుకోవాలి.
తద్వారా శరీర బరువు అదుపులోకి రావడమే కాదు ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది.ఫలితంగా వేరియంట్ ఎటాక్ చేసే ప్రమాదం తగ్గుతుంది.