తాత డ‌బ్బులు కొట్టేసిన దుండ‌గులు.. పోలీస్ ఆఫీస‌ర్ ప‌నికి నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు

కాలం ఎంత మారుతున్నా కూడా ఇంకా చాలామంది త‌మ సొంత కాళ్ల మీదే నిల‌బ‌డేందుకు క‌ష్ట‌ప‌డుతున్నారు.

వ‌య‌సు మీద ప‌డుతున్నా త‌మ సంపాద‌న తామే చూసుకుంటూ బ‌తుకీడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు.

ఇలాంటి ఆత్మ‌గౌర‌వం క‌లిగిన వారు ఎవ‌రి మీద ఆధార‌ప‌డేందుకు ఇష్ట‌ప‌డ‌రు.తాము చ‌నిపోయిన త‌ర్వాత కూడా త‌మ సంపాద‌న‌తోనే అంత్య‌క్రియ‌లు చేయాల‌ని కోరుకునే వారు ఎంతోమంది ఉన్నారు.

అయితే కొన్నిసార్లు ఇలాంటి వారినే కాలం ప‌రీక్షిస్తుంది.క‌ష్టాల పాలు చేస్తుంది.

అలాంటి వ్య‌క్తి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.జమ్మూ కశ్మీర్‌ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ రెహమాన్ వృత్తిరీత్యా ప‌ల్లీలు అమ్ముకుంటు బ‌తుకుతున్నాడు.

Advertisement

ఎప్ప‌టి నుంచో రోడ్డు ప‌క్క‌న ఇలా ప‌ల్లీలు అమ్ముకుంటూనే కుటుంబానికి ఆస‌రా అవుతున్నాయి.అయితే అత‌ను ఏండ్ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డి లక్ష రూపాయల వరకు దాడుచుకున్నాడు.

ఇందులో కొన్ని తాను వృద్ధాప్యంలో హాస్పిట‌ల్ ఖ‌ర్చుల కోసం, మ‌రికొన్ని మాత్రం తాను చ‌నిపోయాక అంత్యక్రియలు చేసుకునేందుకు అని పెట్టుకున్నాడు.అయితే కొంద‌రు దుర్మార్గులు ఆయ‌న క‌ష్టాన్ని దొంగిలించారు.

దీంతో తాత వెళ్లి పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశాడు.దీంతో రంగంలోకి దిగిపోయిన పోలీసులు విచార‌ణ స్టార్ట్ చేశారు.

కాగా ఇదే విష‌యం సందీప్ చౌద‌రి అనే ఉన్న‌తాధికారి దృష్టికి వెళ్లింది.దీంతో ఆయ‌న మ‌న‌సు క‌రిగిపోయింది.రెహమాన్ అడ్ర‌స్ తెలుసుకున్న ఆయ‌న‌.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..

వెంట‌నే తానే స్వ‌యంగా ఆ ల‌క్ష రూపాల‌ను సాయంగా అందించాడు.ఈ విష‌యా కాస్తా ఉన్న‌తాధికారుల‌కు తెలియ‌జేయ‌డంతో అంతా ఆ పోలీస్ ఆఫీస‌ర్‌ను ప్ర‌శంసించారు.

Advertisement

ఈ విష‌యం నెట్టింట్లో షేర్ చేయ‌గా నెటిజ‌న్లు కామెంట్ల రూపంలో ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.ఇలాంటి వారు అన్ని డిపార్టుమెంట్ల‌లో ఉండాలంటూ కోరుతున్నారు.

ఇలాంటి వారు పోలీస్ డిపార్టుమెంటులో ఉంటే ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నారు.

తాజా వార్తలు