పాత సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో లక్షల్లో సంపాదన!

ఈ స్మార్ట్ యుగంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్( Electronic Gadgets ) వాడకం ఎక్కువైపోయింది.మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్స్, నోట్స్, ల్యాప్‌టాప్‌ వంటి పరికరాల వాడకం అయితే మరీ ఎక్కువైపోయిందని చెప్పుకోవచ్చు.

 Old Laptops Cell Phones Recycling Business,old Laptops,cell Phones,recycling Bus-TeluguStop.com

ఈ లిస్టులో కనీసం రెండు వస్తువులను మీరు ఈపాటికే వాడుతుంటారు.ఇక మిగిలినవి ఇంట్లో అలంకారప్రాయంగా పడి వుంటాయి.

వాటిలో దాదాపుగా కొన్ని పరికరాలు పాడైపోయి ఉండొచ్చు.అలా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను వేస్ట్ పరికరాలు అని మీరు అనుకుంటే అది పొరపాటే.

ఇటీవల జరిగిన అధ్యయనంలో గుర్తించిన విషయాలు తెలిస్తే మీ అభిప్రాయాన్ని తప్పకుండా మార్చుకుంటారు.

Telugu Accenture, Cell, Waste, Laptops-Latest News - Telugu

అవి దేశంలోని గొప్ప సంపద అని తాజాగా ఓ అధ్యయనం చెబుతోంది.ఇటీవల ఐసీఈఏ (ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్), ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్( Accenture ) సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించగా అవాక్కయే విషయాలు వెల్లడయ్యాయి.ఈ సర్వే ప్రకారం, దాదాపు 206 మిలియన్లు, అంటే 20 కోట్ల 60 లక్షల విరిగిపోయిన, పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలు భారతీయుల ఇళ్లలో పడి ఉన్నాయని తేలింది.

వాటిలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి.

Telugu Accenture, Cell, Waste, Laptops-Latest News - Telugu

నిజానికి ఇలాంటి వ్యర్థాలే ఇపుడు ఎలక్ట్రానిక్ రీ సైక్లింగ్ బిజినెస్‌కి ఆధారం.2035 నాటికి ఈ రీసైక్లింగ్ బిజినెస్( Recycling Business ) 20 బిలియన్ డాలర్లకి (దాదాపు లక్షా 66 వేల కోట్ల రూపాయలు) చేరే అవకాశం ఉందని ఆ నివేదికలు వెల్లడించాయి.దీని ప్రకారం, ఈ-వేస్ట్ రిఫర్బిషింగ్( E Waste Refurbishing ), రిపేర్ అండ్ రీసేల్ సహా ఆరురకాల ఎలక్ట్రానిక్స్ రీసైక్లింగ్ బిజినెస్ 2035 నాటికి 7 బిలియన్ డాలర్ల (దాదాపు 58 వేల కోట్ల రూపాయలు) ఆదాయం ఆర్జించగలదని నివేదిక చెబుతోంది.

భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న, అతిపెద్ద రంగంగా ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్ అవతరించనుంది.ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, ఈ రంగంలో దాదాపు 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ఆ నివేదిక ద్వారా వెల్లడైంది మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube