కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ చిత్రాన్ని తెలుగులో ‘ఓ బేబీ’గా రీమేక్ చేసిన విషయం తెల్సిందే.నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ రీమేక్‌లో సమంత ప్రధాన పాత్రలో నటించింది.
అంచనాలను తారుమారు చేస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.దాదాపు పాతిక కోట్ల వసూళ్లను నిర్మాతలకు తెచ్చి పెట్టినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో నిర్మాతలు ఇంకాస్త ఆశ పెట్టుకుంటున్నారు.

ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేయాలని ఆశ పడుతున్నారు.ఈ మద్య కాలంలో ఇండియన్ సినిమాలు చైనాలో విడుదల అవుతున్నాయి.అయితే ఎక్కువ శాతం సక్సెస్ కంటే ఫ్లాప్ అవుతున్నాయి.
ఇలాంటి సమయంలో ఓ బేబీ చిత్రాన్ని చైనాకు డబ్ చేసి పంపాలనుకోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.చైనాలో ఇప్పటికే మిస్ గ్రానీ చిత్రాన్ని చూసి ఉంటారు.
అధికారికంగా విడుదల అవ్వకపోయినా కూడా అనఫిషియల్‌గా చైనాలో మిస్ గ్రానీ చిత్రం పైరసీ అయ్యే ఉంటుంది.

ఒరిజినల్ వర్షన్ మిస్ గ్రానీ చూసిన వారికి డబ్బింగ్ అది కూడా సౌత్ ఇండియాకు తగ్గట్లుగా మార్చిన ఓ బేబీ చిత్రాన్ని చూస్తారనే నమ్మకం అయితే చాలా మందికి లేదు.ఇండియన్ మూవీలు అక్కడ మంచి సత్తా చాటుతున్నా కూడా ఈ సినిమా ఆ స్థాయిలో వసూళ్లను నమోదు చేస్తుందనే నమ్మకం లేకపోయినా కూడా సాహసం చేస్తే పోయేది ఏముందని నిర్మాతలు భావిస్తున్నారు.అక్కడ దాదాపు పది వేల థియేటర్లలో ఈ చిత్రంను రెండు నెలల్లో విడుదల చేయబోతున్నారు.






