వైసీపీని బీజేపీ టార్గెట్ చేసుకున్నట్టేనా ?

దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలనే కోరిక బీజేపీ పెద్దలను కుదురుగా ఉండనీయడంలేదు.ఎన్నికల ముందు వరకు తమకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతుగా నిలిచిన పార్టీలను కూడా ఇప్పుడు బీజేపీ టార్గెట్ చేసుకుంటూ ఆయా పార్టీల్లోని నాయకులను బీజేపీలోకి తీసుకువచ్చేలా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణాలో నాలుగు ఎంపీ సీట్లు రావడం ఆ పార్టీలో హుషారు పెంచింది.కాస్త కష్టపడితే ఇక్కడ పాగా వేయవచ్చనేది బీజేపీ ప్లాన్.

అందుకే బలమైన నాయకులను పార్టీ లో చేర్చుకుంటూ టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తోంది.ఇక ఏపీలోనూ టీడీపీ కు చెందిన కొంతమంది కీలక నాయకులను, నలుగురు రాజ్యసభ సభ్యులను చేర్చుకున్న ఆ పార్టీ ఇప్పుడు తమకు పరోక్షంగా మిత్ర పక్షంగా ఉంటూ వస్తున్న వైసీపీని టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.

-Telugu Political News

ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ, వైసీపీ నేత తోట నరసింహం భార్య తోట వాణిని పార్టీలో చేర్చుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.2019 ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉన్న తోట నరసింహం అనారోగ్య కారణాలతో పోటీగా దూరంగా ఉంటానని చెప్పి తనకు బదులు తన భార్య తోట వాణికి టికెట్ ఇవ్వాల్సిందిగా అధిష్టాన్ని కోరారు.అయితే ఈ ప్రతిపాదనకు చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో నరసింహం ఆయన భార్యతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు.ఆమెకు పెద్దాపురం టికెట్ కూడా దక్కింది.అయితే ఆ ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్ధి నిమ్మకాయల చినరాజప్ప చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.అయితే కొద్దిరోజుల క్రితం చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ కోర్టుకు కూడా వెళ్లారు.

-Telugu Political News

అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ ఆమె అనూహ్యంగా బీజేపీలోకి వెళ్తున్నట్టు తమ అనుచరులకు సంకేతాలు ఇవ్వడం హాట్ టాఫిక్ గా మారింది.కానీ ఏం జరిగిందో తెలియదు కానీ.ఆమె ఉన్నట్లుండి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ద్వారా బీజేపీకి చెందిన జాతీయ నాయకులతో తోట నరసింహం, వాణి దంపతులు మంతనాలు చేసినట్టు తెలుస్తోంది.

వీరిని చేర్చుకోవడం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న బలమైన కాపు సామజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవచ్చని బీజేపీ ప్లాన్ వేస్తోంది.ఈ పరిణామాలన్నిటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్న వైసీపీ అధిష్టానం స్థానిక నాయకులతో సంప్రదింపు చేస్తూ బీజేపీ వైపు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తపడుతోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube