సింగ సముద్రం గండ్ల పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కు సింగ సముద్రం నుంచి వచ్చే నీటి విడుదల కోసం ఏర్పాట్లను సింగ సముద్రం కాలువల కనెక్టింగ్ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ రైతులతో కలిసి పరిశీలించారు.

బోప్పాపుర్ రైతులతో కలిసి బోప్పాపుర్ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ను పాల కేంద్రం వద్ద రెండు గ్రామాల రైతులతో కలిసి చర్చించడం జరిగింది.

సింగ సముద్రం నుండి ఎల్లారెడ్డిపేట వరకు వచ్చే సింగ సముద్రం నీరు వచ్చే కోమటి కుంట తో పాటు పలు చోట్ల పడ్డ గండ్లను రైతులతో కలిసి బాలరాజు యాదవ్ పరిశీలించారు.జేసిబి యంత్ర సహాయంతో గండ్లను పూడ్చివేయాలని నిర్ణయించారు.

కాలువల పూడికతీత పనులు వారం రోజుల లోపు పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది.ఆయన వెంట బోప్పపుర్ ఉపసర్పంచ్ వంగ బాపు రెడ్డి,రాగుల తిరుపతి రెడ్డి,పెంజార్ల సత్తయ్య యాదవ్,జీడి రాజు యాదవ్, ఆరే నర్సింహులు, బింగి మల్లేష్ యాదవ్, బాయికాడి రాజయ్య,ఏర్పుల హన్మయ్య, పయ్యావుల రాజు యాదవ్, ముత్యాల బాల్ రెడ్డి తో పాటు 50 మందికి పైగా రైతులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News