పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, శృతిహాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్.ఈ చిత్రాన్ని కేజిఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా 30 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇంతవరకూ విడుదల చేయలేదు.
ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు ఏకంగా ఈ సినిమా నిర్మాతలను బెదిరించే స్థాయికి వచ్చారు.ఈ సినిమా నుంచి అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటామంటూ సూసైడ్ లెటర్ రాసి పోస్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్ని విడుదల చేయడం కోసం మేకర్స్ అధికారిక ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేశారు.‘Salaar the saga’ పేరుతో ఉన్న ఈ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇకపై ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఇందులోనే ఇవ్వనున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.కేజిఎఫ్ తరహాలోనే ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందని ప్రభాస్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో శృతి హసన్ మొట్టమొదటిసారిగా ప్రభాస్ సరసన పాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్నారు.







