బెయిల్ పై విడుదల అయిన నూతన్ నాయుడు

దళిత యువకుడి శిరోముండనం ఘటన తో మరింత వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు బెయిల్ పై విడుదల అయినట్లు తెలుస్తుంది.

దళిత యువకుడి శిరోముండనం కేసుతో పాటు పలు కేసుల్లో ఆరోపణలు ఎదురుకొంటున్న నూతన్ నాయుడు అరెస్ట్ ఆయిన సంగతి తెలిసిందే.

నూతన్‌నాయుడుకు బెయిల్ లభించడం తో నూతన్‌నాయుడు బుధవారం విశాఖ సెంట్రల్ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు.ఏపీలో సంచలనం సృష్టించిన దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు ఏ8 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే.అతడు దేశం విడిచి పారిపోతున్న సమయంలో సెప్టెంబరు 3న బెంగుళూరు ఉడుపిలో పోలీసులు అరెస్ట్ చేయగా, ఆ తరువాత అతడు చేసిన పలు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.

ఉద్యోగాల పేరుతో మోసం చేయడం, ఉన్నతాధికారి పేరుతో పలువురికి కాల్స్ చేసినట్టు నూతన్ నాయుడు పై అభియోగాలు నమోదు కావడం తో పాటు పలు కేసులు నమోదు అయినట్లు సమాచారం.నూతన్ పై పెందుర్తి, గోపాలపట్నం, కంచరపాలెం, గాజువాక, మహారాణిపేట పీఎస్‌లలో కూడా కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు.

Advertisement

మరోవైపు దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు భార్య కూడా నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే.ఆమె తో పాటు మిగిలిన ఏడుగురు కూడా కొద్దిరోజుల క్రితమే బెయిల్‌పై విడుదల కాగా అయితే ఇప్పుడు తాజాగా నూతన్ నాయుడుకు కూడా బెయిల్ లభించడం తో ఈ రోజు జైలు నుంచి విడుదల అయినట్లు తెలుస్తుంది.

జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు