Viral Video: యువకులను చితకబాదిన నర్సులు.. ఎందుకంటే?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం అధికమైంది.ప్రజలు ఎలాంటి ఇన్సిడెంట్లనైనా త్వరగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

 Nurses Who Beat Two People In Bihar Chapra Hospital-TeluguStop.com

వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన మరుక్షణం వైరల్‌గా మారుతున్నాయి.అయితే ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా ఉన్నా.

మరికొన్ని సీరియస్‌గానే కనిపిస్తుంటాయి.అలాగే వీడియో తీసే సందర్భంలో ప్రత్యర్థి నుంచి వ్యతిరేకత కూడా రావొచ్చు.

అలాంటి ఒక వీడియో సోషల్ మీడియోలో హల్‌చల్ చేస్తోంది.నర్సులు ఇద్దరు యువకులను చితకబాదిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముకేష్ సింగ్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను షేర్ చేశాడు.

ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది.

బీహార్ ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులను వీడియో తీసిన ఇద్దరు యువకులను నర్సులు కర్రలతో తీవ్రంగా కొట్టారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బీహార్‌లోని సరన్ జిల్లా ఛప్రా ఆస్పత్రికి ఇద్దరు యువకులు మెడికల్ సర్టిఫికెట్ కోసం వెళ్లారు.అక్కడ నెలకొన్న పరిస్థితులపై వీడియో షూట్ చేయడం మొదలుపెట్టారు.

దీంతో అది గమనించిన ఆస్పత్రి సిబ్బంది యువకులను గదిలో వేసి బంధించారు.అనంతరం ఆ యువకులను కర్రలతో విపరీతంగా కొట్టింది.

తమను కొట్టొద్దని ఆ యువకులు ప్రాధేయపడినప్పటికీ నర్సు వినిపించుకోలేదు.రికార్డ్ చేసిన వీడియోను వెంటనే డిలీట్ చేయాలని బలవంతం చేశారు.దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.ఈ వీడియోను బీహార్ ఆరోగ్య శాఖకు ట్యాగ్ చేశారు.ఈ ఘటనపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు.అయితే ఈ ఘటనపై బీహార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎలాంటి స్పందిస్తుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.కాగా, 1.15 నిమిషాలున్న ఈ వీడియోకు 21.6కే వూవ్స్ వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube