దేవర మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఎన్టీయార్...

ప్రస్తుతం కొరటాల శివ ( Koratala shiva )జూనియర్ ఎన్టీఆర్ తో దేవర( Devara ) అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా మీద ఇండస్ట్రీలో ఉన్న చాలామంది కి మంచి అభిప్రాయం ఉంది అందుకే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద సగటు అభిమానితో పాటు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.

ఈ సినిమా సక్సెస్ అవడం కొరటాల శివకు ఎంత ముఖ్యమో జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం అయితే ఈ సినిమా పక్క హిట్ అవుతుంది అని ఇప్పటికే కొరటాల శివ చాలామంది దగ్గర చెప్తున్నట్టు గా తెలుస్తుంది.

ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది దాంతో ఆయన ఒకసారి గా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు.అయితే ఆర్ఆర్ అర్ సినిమా అనేది రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కలిపి చేశారు కాబట్టి అది మల్టీస్టారర్ సినిమా అవుతుంది ఇక ఆ సినిమా ఎంత కలెక్షన్స్ ని రాబట్టినా కూడా అది సోలో హిట్ మాత్రం అవ్వదు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ( NTR )సోలోగా హిట్ కొట్టి తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అందుకే ఈ సినిమా విజయం సాధించడం ఆయనకు చాలా ముఖ్యం ప్రస్తుతం తన తోటి హీరోలు అయినా మహేష్ బాబు( Mahesh Babu ), రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ వందల కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నారు ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.ఇక ఈ పోటీని తట్టుకొని ఎన్టీఆర్( NTR ) నిలబడాలి అంటే ఈ సినిమా హిట్ అనేది అతనికి చాలా అవసరం అందుకోసమే కొరటాల శివ రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ ని కూడా ఎన్టీఆర్ దగ్గరుండి మరి మార్పులు చేర్పులు చేసుకొని ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.దాంతో ఎన్టీఆర్ ఈ సినిమా పక్కాగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అనే కాన్ఫిడెంట్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

సినిమా రిలీజ్ అయితే గాని మనం ఆ సినిమా రేంజ్ హిట్ ని అంచనా వేయలేము.చూడాలి మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు