గుడివాడలో ఎన్టీఆర్ టూ వైయస్సార్ మన ఊరు మన సంక్రాంతి సంబరాలు ప్రారంభం

కృష్ణా జిల్లా గుడివాడ: ఎమ్మెల్యే కొడాలి నాని-చిన్ని సోదరుల ఆధ్వర్యంలో గుడివాడలో ఎన్టీఆర్ టూ వైయస్సార్ మన ఊరు మన సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి.కే కన్వెన్షన్ ప్రాంగణంలో వృషభరాజాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, చర్నాకోల్ తిప్పుతూ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శనను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు.

 Ntr To Ysr Mana Uru Mana Sankranti Celebrations Begin At Gudivada, Ntr To Ysr Ma-TeluguStop.com

తొలి రోజు రెండు పళ్ళ విభాగంలో జరిగిన ప్రదర్శనలో పలు రాష్ట్రాలకు చెందిన ఎడ్ల జతలు పాల్గొన్నాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగలు జరుపుకుంటారన్నారు.

గ్రామాల్లో రైతులు ఎంతో వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగల్లో, ఎక్కడ నివసిస్తున్న కుటుంబాలతో పాటు స్వగ్రామాలకు చేరుకొని పండుగలో పాల్గొంటారని ఎమ్మెల్యే కోడాలి నాని అన్నారు.పండుగలను పురస్కరించుకొని ఒంగోలు జాతి బల ప్రదర్శనలు, కోడి పందాలు, ముగ్గుల పోటీలను నిర్వహించడం ఆనవాయితీ అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఎమ్మెల్యే కొడాలి నాని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రదర్శనలో పాల్గొన్న పశుపోషకులకు ఎమ్మెల్యే కొడాలి నాని జ్ఞాపికలు అందజేశారు.

సంక్రాంతి సంబరాల్లో వైసిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్,పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను,

మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, గుడివాడ ఎంపీపీ గద్దె పుష్ప రాణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలేటి చంటి,గాదిరెడ్డి రామలింగారెడ్డి, మొండ్రు వెంకటేశ్వరరావు, కందుల నాగరాజు, కొంకితల ఆంజనేయ ప్రసాద్,చందు రెడ్డి, గిరిబాబాయ్, గుడ్లవల్లేరు మండల యూత్ అధ్యక్షుడు గుదెరవి, సోషల్ మీడియా కన్వీనర్ తోట రాజేష్ , చింతాడ నాగూర్,ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాలడుగు రాంప్రసాద్, గుడ్లవల్లేరు బాబ్జి,బాను, ప్రదర్శనల రిఫరీ రాదకృష్ణ ప్రసాద్,నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube