మహేష్ ను దాటేసిన ఎన్టీఆర్   NTR Shows His Stamina In Ceded     2015-12-01   05:06:46  IST  Raghu V

ఈ కాలంలో ప్రతి చిన్న విషయంలోనూ పోటిపడుతూ ఉంటారు అభిమానులు. మీ హీరో కి నైజం లో ఇంత వచ్చింది అంటే , మా హీరోకి సీడెడ్ లో ఇంత వచ్చింది అంటూ గొడవపడుతూ ఉంటారు. కేవలం కలెక్షన్ల వరకే పోటిపడరు వీళ్ళు. కాస్త బాక్సాఫీస్ జ్ఞానం ఉన్నవాళ్ళు ఎ హీరోకి ఎంత బిజినెస్ జరిగింది అనే దాని మీద కుడా పోటిపడుతూ ఉంటారు. ఇప్పుడు మహేష్ ఎన్టీఆర్ అభిమానులు కుడా ఇలానే ప్రీ – రిలీజ్ బిజినెస్ మీద పోటిపడుతున్నారు.

సీడెడ్ నందమూరి అడ్డా. అక్కడ మహేష్ అయినా, పవన్ అయినా …. ఎన్టీఆర్ తరువాతే. తన ఏరియాలో బలప్రదర్శన చేసాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో సీడెడ్ రైట్స్ 8.6 కోట్లకు అమ్ముడుపోయాయి . బాహుబలి తరువాత ఇదే హయ్యెస్ట్. బాహుబలిని 13 కోట్లకు సీడెడ్ లో వారాహి వాళ్ళు కొంటె, నాన్నకు ప్రేమతో హక్కులు సంతా పిక్చర్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈ నందుమూరి అడ్డాలో శ్రీమంతుడు 7.2 కోట్లకు అమ్ముడుపోయింది.

సీడెడ్ లో ప్రతాపం చూపించిన్నప్పటికి మిగితా ఏరియాల్లో మహేష్ ను కొట్టడం ఎన్టీఆర్ కు పెద్ద సవాలే. ఇప్పటికే నైజం, ఓవర్సీస్ మార్కెట్స్ లో అమ్ముడుపోయిన నాన్నకు ప్రేమతో, రెండు చోట్లా శ్రీమంతుడు ని దాటలేకపోయింది.