ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా ఇండియన్ వైడ్ గా రిలీజ్ అయ్యి భారీ రికార్డులను కొల్లగొట్టింది.
ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించి.నటన పరంగా అదరగొట్టారు.థియేటర్స్ లో చాలా రోజులు సందడి చేసిన ఈ సినిమా ఆ తర్వాత ఓటిటిలో కూడా ప్రేక్షకులను అలరించింది.ఇక ఇటీవలే ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేసారు.
అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం స్వయంగా దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు తమ సతీమణులతో కలిసి జపాన్ చుట్టేసి వచ్చారు.
దీంతో ఈ సినిమా అక్కడ కూడా భారీ హైప్ తో దూసుకు పోతుంది.

జపాన్ లో ఈ సినిమా వారం వారం గడిచే కొద్దీ మంచి కలెక్షన్స్ రాబడుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.తాజాగా జపాన్ లో ఈ సినిమా మరో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.ఈ సినిమా రిలీజ్ అయిన మూడు వారాల్లోనే అరుదైన ఫీట్ అందుకుంది.
అక్కడ భారీ వసూళ్లు నమోదు చేస్తూన్న ఈ సినిమా మరో మైలురాయి రీచ్ అయ్యింది.జపాన్ లో 250 మిలియన్స్ వసూలు చేసి ఫాస్టెస్ట్ ఇండియన్ సినిమాగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.3 వారాల్లోని ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడం అంటే మాములు విషయం కాదు.మరి ఇది ఎక్కడ ఆగుతుందో చూడాలి.







