హైదరాబాదులో మళ్లీ పెట్రోల్ బంకుల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.ఎలక్ట్రానిక్ చిప్పులతో వినియోగదారులను బంకు యజమానులు మోసగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎస్ఓటీ అధికారులు నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఇందులో భాగంగా శివరాంపల్లి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో అధికారులు తనిఖీలు చేశారు.
చిప్ తో లీటరుకు రూ.పది గండి కొడుతున్నట్లుగా గుర్తించారు.అనంతరం చిప్ లు అమర్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.కాగా నగర వ్యాప్తంగా పలు బంకుల్లో చిప్ లు అమర్చినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.







