బీజేపీ అగ్ర నేతలుగా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ప్రధాని నరేంద్ర మోది, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ఇది అత్యంత కీలక సమయం.ఈ ఇద్దరు బడా నేతల సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల అయిపోయింది.ఇక్కడ గెలిచేందుకు , హ్యాట్రిక్ సాధించేందుకు బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.1995 నుంచి గుజరాత్ లో బిజెపి అధికారంలో ఉంటూ వస్తుంది.దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సాధించింది.
అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బిజెపి హవాకు తిరుగులేకుండా ఉన్నా.ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మాత్రం గెలుపు అంత ఆషామాషి కాదనే విషయం అందరికీ అర్థమైపోయింది.2014 ముందు వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోది ఉన్నారు.ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన కొత్త విధానాలు పాటించడం, దేశవ్యాప్తంగా గుజరాత్ కు ప్రత్యేక స్థానం దక్కడానికి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి దోహదం చేసింది.
గుజరాత్ లో ఆయన పనితీరు ఏంటో అందరికీ అర్థం అయ్యింది కాబట్టే, ఆయనకు ప్రధానమంత్రి పదవి కూడా రావడానికి కారణం అయ్యింది.
అయితే సుదీర్ఘకాలం బిజెపి అధికారంలో ఉండడంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది.
ఇప్పుడు అదే భయం బిజెపి అగ్ర నేతలుగా ఉన్న మోది, అమిత్ షా లలో కనిపిస్తోంది.గుజరాత్ ప్రజలు బిజెపి వైపు నిలబడతారని ఈ ఇద్దరు అగ్ర నాయకులు ఆశలు పెట్టుకున్నారు.2017 ఎన్నికల్లో బిజెపి కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది. కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వడంతో 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ లో కేవలం 99 స్థానాలే బిజెపికి దక్కగా, కాంగ్రెస్ 80 స్థానాల్లో గెలిచింది.
అయితే ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా మరిన్ని ఎక్కువ స్థానాల్లో పాగా వేసేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులను పరిశీలిస్తూ దాని కనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది.

ఇదిలా ఉంటే ఢిల్లీ తోపాటు , పంజాబ్ లోను గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా ఇప్పుడు గుజరాత్ ఎన్నికలపై దృష్టి సాధించడంతో పాటు, పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టింది.అయితే మొదట్లో ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో బిజెపి కాస్త ఆందోళన చెందినా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుతాయని , అప్పుడు మరింత సులువుగా గెలావ వచ్చు అని బిజెపి ఆశాభావంతో ఉంది.ఇప్పుడు ఆ రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ స్థాయిలో చీల్చుతాయి అనే దానిపైనే బీజేపీ లెక్కలు వేసుకుంటోంది.







