అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున పోటీ చేస్తానని ప్రకటించారు.ఫ్లోరిడాలోని రిసార్ట్ లో వందలాది మంది కార్యకర్తలు, సన్నిహితుల సమక్షంలో ఈ కీలక ప్రకటన చేశారు.
అమెరికాను గొప్ప దేశంగా మళ్ళీ తీర్చి దిద్దుతానని, ప్రస్తుతం బిడెన్ పాలనలో అమెరికా వెలుగును కోల్పోయిందని, చేతకాని దేశంగా బిడెన్ తీర్చి దిద్దుతున్నారని ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ప్రతీ అమెరికన్ మీద ఉందని అన్నారు.అందుకే మళ్ళీ అమెరికాకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు.
అయితే.
తాజాగా ట్రంప్ గారాల కూతురు, అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలో ట్రంప్ కు అన్నీ తానై నడిపించిన ఇవాంకా ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
ఇకపై తాను రాజకీయాలలో ఉండబోవడం లేదని ప్రకటించారు.తాను అధ్యక్ష బరిలో ఉంటున్నానని ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇవాంకా ట్రంప్ ఈ కీలక ప్రకటన చేయడం అందరికి షాక్ కి గురిచేసింది.
తన తండ్రి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు సంభందించిన విషయమని అయితే తాను మాత్రం ఎలాంటి ప్రచారంలో పాల్గోననని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఇకపై తన సమయం మొత్తం తన పిల్లలతో కలిసి గడిపేందుకు వెచ్చిస్తానని ఆమె తెలిపారు.2024 ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశ్యం లేదని అలాంటి ఆలోచన చేయడం లేదని తెలిపారు ఇవాంకా.అయితే తన తండ్రి ట్రంప్ కి ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని ప్రత్యక్ష రాజకీయాల్లో నేను పాల్గొనక పోయినా రాజకీయాలతో సంభంధం లేకుండా సహకరిస్తానని అన్నారు.
కాగా ఇవాంకా తీసుకున్న ఈ నిర్ణయంతో ట్రంప్ వర్గం షాక్ అయ్యింది.అసలు ఎందుకు ఇవాంకా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.కేవలం కుటుంబం గురించేనా ఇతరాత్రా కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.







