బుల్లితెరపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ హోస్ట్ గా అందరిని అనిపచారు.ఇప్పుడు ఇంకో పాపులర్ షో “మీలో కోటీశ్వరుడు” హోస్ట్ ఎన్టీఆర్ అభిమానులను అలరించనున్నారు.
ముందు ఈ షో ల అక్కినేని నాగార్జున మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతలుగా కనిపించారు.ఇప్పుడు ఎన్టీఆర్ ర్ ఈ షోలో వ్యాఖ్యాత గా రానున్నారు.
హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరణ వేగంగా జరుగుతుంది.ఈ షో కి ఫస్ట్ గెస్ట్ గా ఓ స్టార్ హీరో వస్తారంట.
ఆ స్టార్ హీరో ఎవరంటే మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ” లో చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నా విషయం అందరికీ తెలిసిందే.
ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఇంతకుముందు కన్నా మంచి స్నేహం ఏర్పడింది. ప్రతి ఫ్రేములో అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారు. “ఆర్ ఆర్ ఆర్” చిత్రం ప్రమోషన్ కూడా అవుతుంది.అందుకే ఈ షో కి ఫస్ట్ గెస్ట్ గా రామ్ చరణ్ ఆహ్వానిస్తున్నారట.