టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్.సిసింద్రీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అఖిల్ ఈ సినిమాతో సంవత్సరం వయసులో ఉన్న బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత హలో సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.కానీ ఈ సినిమా అంత సక్సెస్ అవ్వలేదు.
మిస్టర్ మజ్ను కూడా అఖిల్ కి నిరాశను కలిగించింది.దీంతో అఖిల్ సక్సెస్ ల కోసం ఎదురు చూస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈయన నటిస్తున్న ఏజెంట్ సినిమా కోసం ఓ తమిళ హీరోయిన్ అని తెలుస్తుంది.
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు అఖిల్.
ఈ సినిమా స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనుంది.ఇదివరకు నటించిన పాత్రలలో కాకుండా కొత్త పాత్రలో కనిపించనున్నాడు అఖిల్.
తాజాగా ఈ సినిమా నుండి ఓ లుక్ కూడా విడుదల కాగా అక్కినేని అభిమానులను బాగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు వినిపించాయి.
కాగా ఇటీవలే ఈ సినిమాలో తమిళ బ్యూటీని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.ఇంతకీ ఆమె ఎవరో కాదు నాడోడిగల్ 2 ఫేమ్ అతుల్య రవి.

సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు సురేందర్ రెడ్డి.మొత్తానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా హీరోతో సమానంగా ఉండేటట్లు చేస్తున్నాడని తెలుస్తుంది.కాగా ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రాకపోగా మరో ఇద్దరు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే అఖిల్ ఈ సినిమాపైనే కాకుండా గతంలో విడుదలకు సిద్ధంగా ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పై కూడా ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.అంతేకాకుండా అఖిల్.కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.ఇక ఈ విషయం గురించి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు.