ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా విడుదలకు సిద్ధం అయ్యిపోయింది.ఇప్పుడు అభిమానుల్లో ఎన్టీఆర్ తర్వాత సినిమా ఏమిటి అని ఆలోచిస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ మాత్రం ఇంకా ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు.మొన్నటివరకు జనతా గ్యారేజ్ అయ్యాక వక్కతం వంశీ తో సినిమా ఉంటుందని ప్రచారం సాగింది.
వంశీ ప్రాజెక్ట్ టెంపర్ సమయంలోనే పట్టాలెక్కలి.పూరి రావటంతో ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళిపోయింది.
అయితే ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే జనతా గ్యారేజ్ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటాడట.అయితే ఆ గ్యాప్ ఎంతకాలం అనేది ఎన్టీఆర్ చెప్పలేదు.
”నాన్నకు ప్రేమతో తరవాత వెంటనే జనతా గ్యారేజ్ మొదలెట్టేశాం.మధ్యలో విరామం దొరకలేదు.
ఇప్పుడు విరామం తీసుకోని మంచి కథలను విని ఒకే చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడు.ఒకవేళ మంచి కథ సెట్ కాకపోతే వక్కతం వంశీ సినిమా చేయవచ్చనే ఆలోచనలో ఉన్నాడు యాంగ్ టైగర్.







