ఫ్యామిలీతో దేవర షూటింగ్ కి పయనమైన తారక్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈయన ఒకవైపు దేవర సినిమా( Devara Movie ) షూటింగ్ పనులలో బిజీగా ఉంటున్న మరోవైపు కొత్త సినిమా పనులలో బిజీ అయ్యారు.

అలాగే బాలీవుడ్ చిత్రం వార్ 2( War 2 ) సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్( Thailand ) వెళ్లినట్టు తెలుస్తుంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో దేవర సినిమా పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితే మొదటి భాగం అక్టోబర్ 10 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

కానీ ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయాన్ని కంటే ముందుగా పూర్తి కానున్న నేపథ్యంలో సెప్టెంబర్ 27వ తేదీనే ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

Advertisement

ఈ క్రమంలోనే శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఇక ఇటీవల గోవాలో ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ వచ్చారు.అయితే ఓ పాట షూటింగ్లో భాగంగా చిత్ర బృందం థాయిలాండ్ వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో కలిసి థాయిలాండ్ వెళ్లారు.ఇలా ఒక వైపు సినిమా షూటింగ్ తో పాటు మరోవైపు తన ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లినట్టు ఉంటుందని భావించిన తారక్ తన ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ పయనమయ్యారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్( Janhvi Kapoor ) నటిస్తున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు