నందమూరి ఎన్టీఆర్ అంటేనే భారతీయత ఉట్టిపడేలా ఉంటుంది.తెలుగుదనం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
తెలుగు జాతి ఉన్నంత వరకూ ఆయన ఖ్యాతి ఉంటూనే ఉంటుంది.తెలుగు చిత్ర సినిమాకి ఎంతో గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆయన తనయుడు హీరో ,ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ బయోపిక్ రూపంలో ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించనుంది.మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుగుస్టాప్ న్యూస్ సమీక్ష లో చూద్దాం.
కథ :
ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ అనారోగ్యం కారణంగా వైద్యం చేయించుకునే సందర్భం నుంచీ కధ మొదలవుతుంది.బెజవాడలో 1947 లో రిజిస్ట్రార్ గా పనిచేసే ఎన్.టి.ఆర్ ఆ జాబ్ ను రిజైన్ చేసి సినిమా హీరో అవుదామని మద్రాస్ వెళ్తారు.అయితే అవకాశాలు రాక ఇబ్బందులు పడుతాడు.
ఆ తరువాత మాయాబజాల్ లో కృష్ణుడుగా అలరిస్తాడు.అప్పటి నుండి ఎన్టీఆర్ సినీ జీవితం సాగిపోతుంది.
తన మనోగతంగా ఎన్.టి.ఆర్ తన జీవితంలో బసవతారకమ్మ ఎంతటి గొప్ప పాత్ర పోషించారో గుర్తు చేసుకుంటూ కధ సాగుతుంది.
నటీనటుల ప్రతిభ.
ఈ సినిమాకి బాలకృష్ణ నటన ప్రాణం పోసింది.తండ్రి పాత్రలో లీనమై ఎంతో గొప్పగా నటించాడు బాలయ్య.
ఎన్టీఆర్ ఆహార్యంలో కాని , డైలాగ్ చెప్పడంలోకాని ఎన్టీఆర్ లా అచ్చు గుద్దినట్టు చేశాడు.ఇక బసవతారకమ్మగా విద్యా బాలన్ గొప్ప గా నటించింది.
ఏయన్నార్ గా సుమంత్ నటన చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.కళ్యాణ్ రాం హరికృష్ణ పాత్రలో రానా ,నారా చంద్రబాబుగా అచ్చుగుద్దినట్టు సరిపోయారు అంతేకాదు నటన పరంగా కూడా సెట్ అయ్యారు.
ఇక హీరోయిన్స్ గా శ్రీదేవి, జయసుధ, జయప్రదలుగా రకుల్.పాయల్.
హాన్సిక కనిపించి అలరించారు.సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
టెక్నికల్ గా.
సినిమాకి టెక్నికల్ గా మాంచి మార్కులు పడింది జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీకి.సినిమా ఫోటోగ్రఫి అద్భుతంగా ఉంది.సినిమాలో అన్ని గెటప్పులలో బాలకృష్ణని చాలా అందంగా చూపించారు జ్ఞానశేఖర్.కీరవాణి మ్యూజిక్ కూడా ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది…బిజిఎం కూడా అలరించింది.కథ కథనాల్లో క్రిష్ మార్క్ దర్సకత్వం తప్పకుండా కనిపిస్తుంది.
అత్యుత్తమ దర్శకుడిగా తన చక్కటి ప్రతిభ కనబరిచాడు క్రిష్ .నిర్మాతగా బాలకృష్ణ కూడా సక్సెస్ అయ్యారని చెప్పాలి.
విశ్లేషణ :
ఎన్టీఆర్ యువకుడిగా ఉన్నప్పటి నుంచీ మొదలు, సినిమాలలో ఎంట్రీ ఇవ్వడం, సినిమా పరిశ్రమలు ఆయన చేసిన పాత్రలు ,తెలుగు సినిమా పరిశ్రమకి కోసం ఆయన చేసిన కృషి కధానాయకుడు లో ప్రతిబించేలా చేశారు.
సినిమాలో బాలకృష్ణ అచ్చం ఎన్.టి.ఆర్ లా అభినయం అదరగొట్టాడు.కొద్దిసేపు మన చూసేది నిజంగా ఎన్.టి.ఆర్ అనేలా బాలయ్య కనిపిస్తారు.మొత్తం 60 పాత్రల దాకా బాలయ్య ఈ సినిమాలో చేశారు.
ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని విషయాలు చూపించారు.బాలకృష్ణ వన్ మ్యాన్ షోగా నటించిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుంది అనడంలో సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్
తెలుగుస్టాప్ రేటింగ్ : 3.5/5
బోటం లైన్ – తెలుగు ప్రేక్షకులని అలరించే “కధ”…ఎన్టీఆర్ కధానాయకుడు
.