ఒకవైపు ఎన్నికల యుద్ధంలో అధికారం అనే సింహాసనాన్ని అందుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు జగన్.ప్రస్తుతానికి ఏపీలో వైసీపీ గాలి గట్టిగానే వీస్తోంది అని గ్రామస్థాయి నుంచీ పెద్ద చర్చే జరుగుతోంది.అయితే…ఇటువంటి అనుకూల వాతావరణంలో ఆ పార్టీకి చెందిన ఓ కీలక నేత పార్టీకి గుడ్ బాయ్ చెప్పడం కలకలం రేపుతోంది.

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు అయిన ఘట్టమనేని ఆదిశేషగిరి రావు జగన్‌కు షాక్ ఇచ్చారు.ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.ఈ మేరకు ఉదయం రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత జగన్‌కు పంపించారు.
అయితే ఆదిశేషగిరి రావు పార్టీని ఎందుకు వీడుతున్నారో అనే విషయంలో పెద్దగా క్లారిటీ లేకపోయినప్పటికే… ఆయన మాత్రం త్వరలోనే తెలుగు దేశం పార్టీలో చేరేందుకు డిసైడ్ అయిపోయారట.ఈ మేరకు ఆయనకు టీడీపీ అధినేత నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం.