యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ఫేమస్ స్టార్ గా మారిపోయాడు.మరి అలాంటి స్టార్ నుండి ఒక అప్డేట్ వచ్చింది అంటే అది ఏ రేంజ్ లో ఫేమస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇప్పుడు ఎన్టీఆర్ నుండి వచ్చిన అప్డేట్ కూడా అలానే పాపులర్ అయ్యింది.నిన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తారక్ అనౌన్స్ చేయడం పాన్ ఇండియా వ్యాప్తంగా ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)- ఎన్టీఆర్ కాంబోలో ”వార్” (WAR 2) సీక్వెల్ వస్తుందని.బాలీవుడ్ కన్ఫర్మ్ చేసింది.ఈ ఊహించని కాంబోపై అందరిలో ఆసక్తి పెరిగింది.సౌత్ నుండి ఎన్టీఆర్, నార్త్ నుండి హృతిక్ కలయిక కావడం ఇండియా మొత్తంలో నెక్స్ట్ లెవల్ ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది.
మరి ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి.
ఈ రోజు ఎన్టీఆర్ చేయనున్న ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ నుండి మరో అప్డేట్ వచ్చింది.
యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థపై అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) నిర్మిస్తున్న వార్ 2 లో ఎన్టీఆర్ కూడా భాగం అయ్యారు.అయితే ప్రజెంట్ ఎన్టీఆర్ చేతిలో రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి.
ప్రస్తుతం NTR30 సినిమా షూట్ లో తారక్ బిజీగా ఉన్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ముందుగా అనౌన్స్ చేసిన NTR31 సినిమాలో తారక్ పాల్గొంటాడు అని అనుకుంటే ఇప్పుడు కాదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ తన 31వ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రకటించాడు.ఈ సినిమా కంటే ముందే నిన్న అనౌన్స్ మెంట్ వచ్చిన వార్ 2 షూట్ లో పాల్గొంటారట.

మరికొద్ది రోజుల్లోనే వార్ 2 డైరెక్టర్, నిర్మాతలు, టీమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారని.వీలైనంత ఫాస్ట్ గా ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.మరి ఇదే నిజమైతే ఎన్టీఆర్ NTR31 కంటే ముందే వార్ 2 రెడీ అవుతుంది.ఈ విషయంలో ప్రశాంత్ నీల్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.







