NTR30 తర్వాత ‘వార్ 2’ అంటున్న తారక్.. మరి నీల్ ఒప్పుకుంటాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ఫేమస్ స్టార్ గా మారిపోయాడు.

మరి అలాంటి స్టార్ నుండి ఒక అప్డేట్ వచ్చింది అంటే అది ఏ రేంజ్ లో ఫేమస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడు ఎన్టీఆర్ నుండి వచ్చిన అప్డేట్ కూడా అలానే పాపులర్ అయ్యింది.నిన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తారక్ అనౌన్స్ చేయడం పాన్ ఇండియా వ్యాప్తంగా ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)- ఎన్టీఆర్ కాంబోలో ''వార్'' (WAR 2) సీక్వెల్ వస్తుందని.

బాలీవుడ్ కన్ఫర్మ్ చేసింది.ఈ ఊహించని కాంబోపై అందరిలో ఆసక్తి పెరిగింది.

సౌత్ నుండి ఎన్టీఆర్, నార్త్ నుండి హృతిక్ కలయిక కావడం ఇండియా మొత్తంలో నెక్స్ట్ లెవల్ ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది.

మరి ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి.

ఈ రోజు ఎన్టీఆర్ చేయనున్న ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ నుండి మరో అప్డేట్ వచ్చింది.

యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థపై అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) నిర్మిస్తున్న వార్ 2 లో ఎన్టీఆర్ కూడా భాగం అయ్యారు.

అయితే ప్రజెంట్ ఎన్టీఆర్ చేతిలో రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి.ప్రస్తుతం NTR30 సినిమా షూట్ లో తారక్ బిజీగా ఉన్నారు.

"""/" / ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ముందుగా అనౌన్స్ చేసిన NTR31 సినిమాలో తారక్ పాల్గొంటాడు అని అనుకుంటే ఇప్పుడు కాదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ తన 31వ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రకటించాడు.

ఈ సినిమా కంటే ముందే నిన్న అనౌన్స్ మెంట్ వచ్చిన వార్ 2 షూట్ లో పాల్గొంటారట.

"""/" / మరికొద్ది రోజుల్లోనే వార్ 2 డైరెక్టర్, నిర్మాతలు, టీమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారని.

వీలైనంత ఫాస్ట్ గా ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరి ఇదే నిజమైతే ఎన్టీఆర్ NTR31 కంటే ముందే వార్ 2 రెడీ అవుతుంది.

ఈ విషయంలో ప్రశాంత్ నీల్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.