ఒక్కోసారి భారీ అంచనాల నడుమ విడుదలైన స్టార్ హీరోల చిత్రాలు అనుకోకుండా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ గా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి నేటి తరం కుర్ర హీరోల వరకు చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది.
అయితే 2016 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన “బ్రహ్మోత్సవం” చిత్రం కూడా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించగా చందమామ కాజల్ అగర్వాల్, సమంత అక్కినేని, ప్రణీత సుభాష్, తదితరులు హీరోయిన్లుగా నటించారు.
అయితే అప్పటికే శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టాడు.దీంతో మళ్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ తో హిట్ కొట్టాలని భావించి బోల్తా పడ్డాడు.
అయితే బ్రహ్మోత్సవం మంచి కామెడీ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ తరహాతో తెరకెక్కినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది.దీనికి తోడు బ్రహ్మోత్సవం విడుదలైన సమయంలో ని అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కిన “బిచ్చగాడు” చిత్రం విడుదలవడంతో ప్రేక్షకులు బాగానే ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యారు.దీంతో బ్రహ్మోత్సవం చిత్ర కలెక్షన్లకి గండి పడింది.
అయితే బ్రహ్మోత్సవం చిత్రం విడుదలై ఇటీవలే ఐదు సంవత్సరాలు కావస్తుండడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.అయితే ముందుగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని అనుకున్నాడట.
కానీ పలు అనివార్య కారణాల వల్ల ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకోలేదట.ఆ తర్వాత మహేష్ బాబు ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నప్పటికీ ఫలితాలు మాత్రం ఎవరూ ఊహించని విధంగా వచ్చాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల తెలుగులో “నారప్ప” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో హీరోగా విక్టరీ వెంకటేష్ నటిస్తుండగా తమిళ బ్యూటీ “ప్రియమణి” హీరోయిన్ గా నటిస్తోంది.
కాగా ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించిన “అసురన్” చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది.