యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో పాన్ ఇండియన్ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా ఇచ్చిన స్టార్ డమ్ తో ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియన్ సినిమాలనే లైన్లో పెట్టుకుంటున్నాడు.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో ఈయన పేరు మరింత మారుమోగి పోతుంది.ఆస్కార్ అందుకుని రెండు రోజుల క్రితమే హైదరాబాద్ లో అడుగు పెట్టాడు.
వచ్చి రాగానే ఎన్టీఆర్ (NTR) తన సహ నటుడు, తన అభిమాని అయిన విశ్వక్ సేన్ ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేశాడు.విశ్వక్ సేన్( Vishwak sen ) హీరోగా నటించి తెరకెక్కించిన ధమ్కీ సినిమా( Dhamki ) మార్చి 22న రిలీజ్ కాబోతుంది.
ఈ క్రమంలోనే నిన్న రాత్రి గ్రాండ్ గా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపారు.ఈ ఈవెంట్ కు అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ ఆ స్టేజ్ మీద చేసిన స్పీచ్ నెట్టింట వైరల్ అయ్యింది.
ఈ వేడుకలో భాగంగా తారక్ తన తనపై కామెంట్స్ చేసాడు.ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయాయి.ఎన్టీఆర్ మాట్లాడుతూ.తాను చేస్తున్న సినిమాల్లో ఒకే రకంగా వెళ్తున్నాం.తనలో తనకి మార్పు కావాలి అనుకున్నప్పుడు.అప్పుడు చేస్తున్న సినిమా సమయంలో మిమ్మల్ని కాలర్ దించుకునేలా చేయను అని చెప్పానని.
ఒక నటుడిగా ఆ రోజే నేను పుట్టానని అప్పటి నుండి మిమ్మల్ని కాలర్ దించుకునేలా చేయలేదని.నటుడిగా నాకు నేని ఆనందంగా ఉండే సినిమాలు చేయాలనీ రియలైజ్ కావడానికి చాలా సమయం తీసుకున్నానని కామెంట్స్ చేసాడు.టెంపర్ సమయంలో తారక్ రియలైజ్ కాగా అప్పటి నుండి ఎన్టీఆర్ ఎలాంటి సినిమాలు చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.ఇక ముందు ముందు కూడా మంచి సినిమాలు ఎన్టీఆర్ నుండి రావాలని కోరుకుందాం.