Ishita Dutta :బేబీ బంప్ తో కనిపించి షాకిచ్చిన దృశ్యం నటి.. వీడియో వైరల్?

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వాటి వ్యక్తిగత విషయాలను ఎంత గోప్యంగా ఉంచాలి అని ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక విధంగా అవి బయటకు తెలుస్తూనే ఉంటాయి.అటువంటి సమయంలో అభిమానులు మండిపడుతూ ఉంటారు.

 Actress Ishita Dutta Baby Bump Video Goes Viral-TeluguStop.com

ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు వారి విషయాలను అభిమానులకు చెప్పకుండా గొప్యత వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే వారు ఎంత గుట్టుగా ఉంచినప్పటికి అవి ఏదో ఒక సందర్భంలో బయటపడక తప్పదు.

తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

దృశ్యం సినిమా నటి తల్లి కాబోతుంది అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.ఆమె మరెవరో కాదు నటి ఇశితా దత్తా( Ishita Dutta )2012లో వచ్చిన చాణక్యుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత 2015లో బాలీవుడ్ లో వచ్చిన దృశ్యం చిత్రంలో అజయ్ దేవ్ గన్( Ajay Devgn ) కు కూతురుగా నటించింది.

ఇక ఈ చిత్రం ద్వారా నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది ఇశితా.ఇక 2022లో వచ్చిన దృశ్యం 2 చిత్రంలో కూడా నటించి దేశవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇశితా ముంబై విమానాశ్రయంలో ఎక్కడికో వెళ్తు కెమెరా కంటికి చిక్కింది.ఆ సమయంలో ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు బేబీ బంప్ ను చూస్తేనే తెలుస్తోంది.ఇక 2017లో వత్సల్ సేథ్ ను పెళ్లి చేసుకుంది ఇశితా.అయితే ఇశిత గానీ ఆమె భర్త వత్సల్ సేథ్ గా ప్రెగ్నెంట్ విషయాన్ని ధృవీకరించలేదు.ఇక ఈ వీడియో చూసిన అభిమానులు తల్లి కాబోతున్న ఇశితకు అభినందనలు తెలుపుతున్నారు.అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొందరు శుభాకాంక్షలు తెలుపుతుండగా మరికొందరు ఎందుకు ఆ విషయాన్ని దాచి పెట్టారు అంటూ మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube