నాగార్జున మాటలకు ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఎన్టీఆర్?

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర.ఈ సినిమా తెలుగులో బ్రహ్మాస్త్రం అనే పేరుతో విడుదల కానుంది.ఇక ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించారు.ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు.ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో సెప్టెంబర్ 2వ తేదీ పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలని ప్లాన్ చేశారు.అయితే చివరి నిమిషంలో ఈ కార్యక్రమం రద్దు కావడంతో ఎంతో మంది అభిమానులు నిరాశపడ్డారు.

 Ntr Got Emotional On Nagarjunas Words And Shed Tears , Ntr ,emotional,nagarjuna,-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వస్తున్నట్లు పేర్కొన్నారు.ఇక ఈ వేడుక రద్దు కావడంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొని సందడి చేశారు.ఇకపోతే ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

నాగార్జున నందమూరి హరికృష్ణకి ఎంతో మంచి అనుబంధం ఉంది.నాగార్జున హరికృష్ణని ఎప్పుడు అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు.

ఇకపోతే సెప్టెంబర్ రెండవ తేదీ నందమూరి హరికృష్ణ జయంతి కావడంతో ఈ విషయం గురించి నాగార్జున ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాట్లాడారు.సెప్టెంబర్ 2 నా అన్న నందమూరి హరికృష్ణ పుట్టినరోజు అంటూ ఆయనని గుర్తు చేసుకోవడంతో నాగార్జున మాటలు విన్న ఎన్టీఆర్ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇక హరికృష్ణ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.అయితే గతంలో ఓ కార్యక్రమంలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ తనకు హరికృష్ణ సొంత అన్నయ్యతో సమానమని అయితే దురదృష్టవశాత్తు తన పుట్టినరోజే అన్నయ్య మరణించడం తనని ఎంతగానో కలిసి వేసిందని నాగార్జున హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube