బర్త్ డే కి ఎన్టీఆర్ కు "లక్ష్మి ప్రణతి" షాకింగ్ గిఫ్ట్..! ఎవ్వరూ ఊహించి ఉండరు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 35 వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకున్నారు.

 Ntr Birthday Gift-TeluguStop.com

సినీ ప్రముఖులు యంగ్ టైగర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేసి ఎన్టీఆర్ అభిమానుల సంతోషాన్ని పెంచింది చిత్ర యూనిట్.అరవింద సమేత వీర రాఘవ అనే అద్భుతమైన టైటిల్ ని త్రివిక్రమ్ ఖరారు చేసారు

ఇదిలావుంటే… ఎన్టీఆర్ పుట్టినరోజంటే ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైన రోజు.ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లి షాలిని ఎన్టీఆర్ పేరిట ప్రత్యేకంగా అర్చన చేయించినట్టు సమాచారం.ఇక తారక్ అర్థాంగి లక్ష్మీప్రణతి నుంచి ఎవరూ ఊహించని గిఫ్ వచ్చింది.

మామూలుగా లక్ష్మీప్రణతి ఎన్టీఆర్ సినిమాల గురించి చాలాతక్కువగా మాట్లాడుతుంది.సినిమా షూటింగ్ లతో అలసిపోయి ఇంటికివచ్చే భర్తను మళ్లీ సినిమా సంగతులే మాట్లాడి విసుగెత్తించకూడదని ఆమె ఫీలింగ్ గా చెబుతుంటారు ఆమెను ఎరిగిన వారు.

అందుకే ఇంట్లో చాలావరకు సినిమా ముచ్చట్లకు స్థానం ఉండదు.

అయితే అరవింద సమేత ఫస్ట్ లుక్ చూసి ఎన్టీఆర్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోయిందట లక్ష్మీప్రణతి.తన సినిమాలు సూపర్ డూపర్ హిట్టయినా పెద్దగా స్పందించని భార్య అరవింద సమేత ఫస్ట్ లుక్ చూసి ఇంప్రెస్ అవడాన్ని తారక్ తన బర్త్ డే గిఫ్ట్ గా భావించాడట.తాను ప్రాణంగా ప్రేమించే భార్య తన సినిమా గురించి మాట్లాడడం, పైగా తన లుక్ బాగుందంటూ అప్రిసియేట్ చేయడాన్ని ఎన్టీఆర్ ఎంతో అపురూపంగా స్వీకరించాడట.

ఈ పుట్టినరోజు నాడు భార్య ఇచ్చిన గిఫ్ట్ ఈ ప్రశంసేనని ఎన్టీఆర్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయాడట.త్వరలోనే ఎన్టీఆర్ మరో శుభవార్త వినబోతున్నాడు.లక్ష్మీప్రణతి నిండు గర్భవతి అని సమాచారం.ఆమె మరో వారంలో ప్రసవించే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాలంటున్నాయి.

ఇప్పటికే ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు అభయ్ రామ్ అనే ఓ కొడుకు ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube