ఆర్ఆర్ఆర్.ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంది.
తెలుగోడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది.ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్.గత ఏడాది మార్చి 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా 1200 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.
రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు.
మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించి అదరగొట్టారు.వీరి నటనకు యావత్ ప్రపంచం ఫిదా అయ్యింది.
ఇక తాజాగా ఈ సినిమా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో నాటు నాటు సాంగ్ కు అవార్డు అందుకుంది.
ఆ తర్వాత క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో రెండు విభాగాల్లో పురస్కారాలు అందుకుని ప్రపంచ వ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.ఇక వరుస అవార్డులను గెలుచుకుంటూ ఆస్కార్ పై సరికొత్త ఆశలను చిగురింప చేస్తుంది.ఈ మూవీ టీమ్ అంతా తమ పార్ట్నర్స్ తో కలిసి గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు వెళ్లి అక్కడ సందడి చేసారు.
అంతేకాదు అక్కడ ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ను నిలపడం కోసం ఈ ఇద్దరు స్టార్ హీరోలు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
అయితే ఈ ప్రమోషన్స్ అన్ని కూడా అక్కడి ఒక ఏజెన్సీ ఆర్గనైజ్ చేసినట్టు సమాచారం.గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ చేసిన హంగామా పలు హాలీవుడ్ మేకర్స్ దృష్టికి ఆ ఆర్గనైజ్ వారు తీసుకువెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి.ఈ ఇద్దరు హీరోలకు అక్కడ సంస్థల్లో ఆఫర్స్ ఇప్పించడానికి ఆ సంస్థ గట్టిగానే ట్రై చేస్తుంది అని అంటున్నారు.
ఇదే నిజమైన మన స్టార్స్ హాలీవుడ్ లో కూడా సందడి చేయడం ఖాయం.