బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలం పొడిగింపు అయింది.ఈ మేరకు పార్టీ అధిష్టానం కీలక ప్రకటన చేసింది.
ఇందులో భాగంగా 2024 జూన్ వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగనున్నారు.అంతేకాకుండా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా జేపీ నడ్డా నేతృత్వంలోనే వెళ్లాలనే పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం.
కాగా ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.వరుస ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధిష్టానం నడ్డా వైపే మొగ్గు చూపుతోంది.