సినిమా ఇండస్ట్రీలో చాలామంది డబ్బు సంపాదించిన తర్వాత బంగ్లాలు,కార్లు, ఆస్తులు కూడబెట్టుకుంటూ ఉంటారు.కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే నటుడు మాత్రం తనకు తన తండ్రి ఏమి ఇవ్వలేదని నేను కూడా నా కొడుక్కి ఏమి ఇవ్వాలనుకోవడం లేదని కుండబద్దలు కొడుతున్నారు.
ఆ నటుడు మరెవరో కాదు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమీడియన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నబ్రహ్మాజీతొలుత హీరోగ ఆ తర్వాత కమీడియన్ గా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయిన బ్రహ్మాజీ ఏటా పదుల సంఖ్యలో సినిమాల్లో నటిస్తున్నాడు.ఇటీవల కాలంలో బ్రహ్మాజీ లేని సినిమా ఉండటం లేదు.
>
ఈస్ట్ గోదావరికి చెందిన బ్రహ్మాజీ చెన్నైలో తొలినాళ్లలో సినిమాల్లో నటించేందుకు కొన్నాళ్లపాటు స్ట్రగుల్ అయ్యాడు.కేవలం తనను పెంచి పోషించి, విద్యాబుద్ధులు మాత్రమే నేర్పించాడు తన తండ్రి అంటూ చెప్తాడు బ్రహ్మాజీ.మధ్య తరగతి కుటుంబం లో పుట్టిన తనకు డబ్బు వచ్చిన కూడా పెద్దగా లైఫ్ స్టైల్ మారలేదు అంటున్నాడు బ్రహ్మాజీ. తాను కూడా తన కొడుక్కి బ్రతకడానికి కావలసిన బ్రతుకుతెరువు చూపిస్తానని అంతేకానీ ఆస్తులు మాత్రం కూడా పెట్టనని చెప్తున్నాడు.
ఉన్నంతకాలం చాలా లగ్జరీగా కంఫర్టబుల్ గా లైఫ్ నీ లీడ్ చేయడం తనకు తన భార్యకు ఎంతో ఇష్టమని చెప్తున్నాడు.

ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బుతో దేశ విదేశాల్లో, అలాగే ఇండియాలో ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలను చూస్తున్నామని అందుకే భూములు, విల్లాలు, కార్లు కొనాలని మాకు లేదని, వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు అలాగే పోయేటప్పుడు ఏమి తీసుకుపోము అంటూ చెప్పాడు బ్రహ్మాజీ.ఇప్పటికే దేశం లో అంతా చూశాము.ఇక ప్రపంచ పర్యటన మొదలు పెట్టాం.
కొన్ని దేశాలు ఇప్పటికే చుసేసాం అంటూ ఇటీవల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు బ్రహ్మాజీ. బ్రహ్మాజీ కిఒక కుమారుడు ఉండగా, అతడు కూడా నటుడు అయ్యే ప్రయత్నం లోనే ఉన్నాడు.







