యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ లో ప్రజెంట్ ఉన్న చిత్రాల్లో ”దేవర( Devara )” ఒకటి.ఈయన ఆర్ఆర్ఆర్ వంటి సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.
మరి ఇదే విజయాన్ని కొనసాగించడం కోసం ఎన్టీఆర్ తన నెక్స్ట్ లైనప్ ను మరింత స్ట్రాంగ్ గా సెట్ చేసుకున్నాడు.ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు.
టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాలశివ( Koratala Siva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ఫస్ట్ లుక్ తోనే ఈసారి కొరటాల చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది.ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేస్తూ ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ ను ఇందులో భాగం చేసారు.

ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.అందులోను ఈమె పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం అని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.అలాగే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు.
మరి వీరిద్దరి రోల్స్ గురించి ఇప్పుడు ఒక వార్త వైరల్ అయ్యింది.

జాన్వీ ఈ సినిమాలో ఒక మత్సకారుడి పాత్రలో నటిస్తుందని.ఎన్టీఆర్ ( Jr ntr )పాత్రను ట్రాప్ చేయడం కోసం ఒక మత్సకారుడి కూతురుగా నటిస్తుంది అని తెలుస్తుందని.నిజానికి ఈమె ఒక రా ఏజెంట్ అని టాక్ బయటకు వచ్చింది.
ఇక ఇప్పుడు మరికొద్ది సమాచారం లీక్ అయ్యింది.ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ సవతి కూతురుగా ఈమె నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ రూమర్స్ నిజమో కాదో వేచి చూడాల్సిందే.
ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.