ఎన్టీఆర్‌ 30 కొత్త అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్.. ఫ్యాన్స్ కి నిరాశ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా సినిమా వచ్చి చాలా కాలం అయింది.దాంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.

రాజమౌళి తో సినిమా అంటే మినిమం గా రెండు మూడు సంవత్సరాల సమయం పడుతుంది.ఎన్టీఆర్ సినిమా కూడా అంతే సమయం తీసుకుంటుందని అభిమానులు భావించారు.

కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా మాత్రం ఏకంగా నాలుగు గంటల సమయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ నాలుగేళ్ల సమయం లో ఎన్టీఆర్ మరే సినిమా ను కూడా మొదలు పెట్టలేదు.

పలు సినిమా లకు కమిట్ అయితే అయ్యాడు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమాకు కూడా క్లాప్ కొట్టిందే లేదు.ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న విషయం తెలిసిందే.

Advertisement

వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అందుకే వీరిద్దరి కాంబో లో సినిమా కోసం అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు ఈ సినిమా ప్రారంభం అవుతుందని ఈ ఏడాది ప్రారంభం అవ్వగానే అభిమానులు ఆశపడ్డారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది ప్రథమార్థం లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదంటూ టాక్ వినిపిస్తోంది.

ఎందుకంటే కొరటాల శివ రూపొందించిన కథ విషయం లో కొన్ని కొన్ని మార్పులు చేయాల్సి వస్తుందట.

అంతే కాకుండా ఎన్టీఆర్ లుక్ విషయం లో కూడా కాస్త విభిన్నం గా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.అందుకోసం కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.అందుకే ఈ సినిమా జూన్ లో పట్టాలెక్కించిన అవకాశం ఉందని అంటున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఎప్పుడు ప్రారంభించినా కూడా వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారిక ప్రకటన వచ్చింది.

Advertisement
" autoplay>

తాజా వార్తలు