టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా రిలీజ్ త్వరలోనే ఉంది.
మరొక 8 రోజులు మాత్రమే ఉండడంతో ఈ సినిమా కోసం మరింత ఆతృతగా ఎదురు చూస్తున్నారు.దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆశగా చూస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమా గురించి ఒక్కో వార్త బయటకు వస్తుంటే మరింత ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది.ఇక మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా వాళ్ళ అభిమాన హీరో సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ మొత్తం వరుస ప్రొమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.ఇందులో భాగంగానే మెయిన్ క్రూ అంతా డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కలిసి ఇంటర్వ్యూ చేసారు.ఇందులో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ చెప్పిన పలు ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా చరణ్ గురించి మాట్లాడుతూ.చరణ్ తో ఉన్న అనుబంధం గురించి తెలిపాడు.ఆయనతో ఎలాంటి స్నేహ బంధం ఉందో తెలిపాడు.
ఇదే సందర్భంగా చరణ్ గురించి మాట్లాడుతూ.కొన్ని విషయాలు తెలిపాడు.
పక్కన అగ్ని పర్వతం బద్దలవుతున్న చరణ్ ఎలాంటి టెన్షన్ లేకుండా కామ్ గా ఉంటాడు కానీ నేను అలా ఉండలేనని తాను అగ్రెసివ్ కావడంతో ఇద్దరికీ బాగా కుదిరిందని తెలిపాడు.

అలాగే గత కొన్నేళ్లుగా మార్చి 26 అర్ధరాత్రి జరిగే సీక్రెట్ విషయాన్నీ కూడా ఎన్టీఆర్ బయట పెట్టారు.ప్రణతి బర్త్ డే మార్చి 26.చరణ్ బర్త్ డే మార్చి 27.మార్చి 26 అర్ధరాత్రి 12 గంటలు దాటాక మా ఇంటి ముందు చరణ్ కారు ఆగుతుంది.ఆ వెంటనే నేను చరణ్ కలిసి బయటకు వెళ్ళిపోతాం.
వెంటనే ప్రణతి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని అడుగుతుంది.చరణ్ దగ్గర ఉన్నానని చెప్పడంతో అదేంటీ ఈ రోజు నా బర్త్ డే కదా అని ప్రణతి చెబితే అది నిన్ననే అయిపొయింది కదా.ఇప్పుడు పన్నెండు దాటింది డేట్ మారింది అని చెబుతాను.ఇలా కొన్నేళ్లుగా చరణ్ బర్త్ డే కు వెళ్తున్నాను అంటూ సీక్రెట్ చెప్పాడు.
ఎన్టీఆర్.







