లండన్‌లో నివసిస్తున్న తెలుగు యువతి తేజస్విని( Tejaswini ) దారుణ హత్యకు గురైంది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన తేజస్విని లండన్‌లో స్నేహితులతో పాటు కలిసి మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది.
అయితే ఇటీవల బయటికి వెళ్లిన తేజశ్విని, ఆమె ఫ్రెండ్ అఖిలపై బ్రెజిల్‌కు( Brazil ) చెందిన ఓ వ్యక్తి దాడి చేశాడు.ఈ దాడిలో తేజస్విని తీవ్రగాయాల పాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది.
ఆమె స్నేహితురాలు అఖిలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి కానీ ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది.మరోవైపు ఘటన జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి బ్రెజిల్ వ్యక్తిని అరెస్టు చేశారు.
ఎదిగొచ్చిన బిడ్డ చిన్న వయసులోనే ఇలా హత్యకు గురి కావడం తెలిసే తల్లిదండ్రులు గుండె పగిలారు.తమ కూతురు మరణాన్ని ఊహించని వారు గుండెలు బాధ కొంటూ రోధిస్తున్నారు. ఎం.ఎస్ పూర్తి అయిన తర్వాత తేజస్వినికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని తన తండ్రి ఎంతో తపనపడ్డాడు.ఈ మేరకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం కూడా మొదలుపెట్టారు.ఇంతలోనే లండన్( London ) నుంచి దారుణ వార్త వినాల్సి రావడంతో వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
కాగా తేజస్విని మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకి పంపించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
ఇకపోతే ఇటీవల కాలంలో భారతదేశానికి చెందిన ఆడవారు విదేశాల్లో ఎక్కువగా హత్యలకు బలవుతున్నారు.ముఖ్యంగా అమెరికా, యూకే లాంటి దేశాల్లో ఉన్న సైకో గాళ్ళు అన్యాయంగా ఎన్నారైల ప్రాణాలు తీసేస్తున్నారు.వీరి వల్ల తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతోంది.