భారత్ లో ఎన్నికలు జరిగే సమయంలో ఎన్నారైల ఓట్లు అత్యంత కీలకమనే విషయం అందరికి తెలిసిందే.కొందరైతే కేవలం ఎన్నికల్లో ఓటు వేయడానికి విదేశాల నుంచి పనిగట్టుకుని మరీ వస్తుంటారు.
మరి కొందరు రాలేని పరిస్థితులలో తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశమే ఉండదు.దాంతో ఎన్నో కీలకమైన ఓట్లు నిరుపయోగం అవుతున్నాయి.
ఈ పరిస్థితులపై ఆలోచన చేసిన కేంద్రం ఎన్నారైలకు కూడా పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేసే హక్కు కల్పించడానికి ఆలోచనలు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.
కేంద్రం గనుకా అనుమతులు ఇస్తే ప్రస్తుతం సైనికులు ఓటు వేసేందుకు కల్పిస్తున్న ఎలక్ట్రానికల్, ట్రాన్స్మిటేడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ను విదేశాలలో ఉంటున్న భారతీయ ఎన్నారై లకు కూడా కల్పించాలని యోచిస్తోంది.
ఈ క్రమంలోనే ఈటీపీబీఎస్ (ఎలక్ట్రానికల్, ట్రాన్స్మిటేడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ) విధానాన్ని ఎన్నారైలకు కూడా కల్పించే అవకాశం ఉందని న్యాయశాఖకు లేఖను రాసింది.అన్ని అనుకున్నట్టుగా జరిగితే మొదటి సారిగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళా, అస్సాం వంటి రాష్ట్రాలలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసి చూపిస్తామని తెలిపింది.

విదేశాలలో ఉన్న ఎన్నారైలు ఎంతో మంది స్వదేశానికి వచ్చి ఓటు వేసి వెళ్ళడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే కాకుండా వారికి అది ఎంతో సమయాభావమని తమకు ఎంతో మంది ఎన్నారైల నుంచి పోస్టల్ బ్యాలెట్ కల్పిచమనే విజ్ఞప్తులు అందాయని ఈసీ తెలిపింది.కరోనా మహమ్మారి సమయంలో ఈ సమస్యని మనం పరిష్కరించడం సమంజసమని, కరోనా వ్యాప్తి చెందకుండా ఎన్నారైలు ఇబ్బందులు పడకుండా కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగ పడుతుందని వివరించింది.ఇదిలాఉంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుని వినియోగించుకోవాలని అనుకునే వారు ముందుగా ఈటీపీబీఎస్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటామని ఆయా నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిని తెలుపాలి అప్పుడే పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునే అర్హత కలుగుతుంది.