ఎన్విరాన్‌మెంట్‌కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటున్న ఎన్నారై, ఎంత గొప్ప పని చేస్తున్నారో!

2006లో ఎయిమ్స్, ఢిల్లీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన 42 ఏళ్ల వైద్యుడు డాక్టర్ సన్నీ సంధు భారత ప్రజలకు ఒక మంచి సలహా ఇస్తున్నారు.పంజాబ్‌లోని టార్న్ తరణ్ జిల్లాకు చెందిన ఈ డాక్టర్ పంజాబ్ ప్రీ-మెడికల్‌లో మొదటి ర్యాంక్‌ను సాధించారు.

 Nri Music Therapist Dr Sunny Sandhu Wants People To Make Environment Their First-TeluguStop.com

ఎంతో ప్రతిభగల ఈ ఎన్నారై 1999లో ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో పరీక్షలో మూడవ ర్యాంక్ సంపాదించారు.ప్రస్తుతం, ఈ డాక్టర్ ఫ్రాన్స్‌లోని సెయింట్ పాల్ డి వెన్స్‌లో వెల్‌నెస్ సెంటర్‌ను నడుపుతున్నారు.

తన వైద్య విద్యలో డా.సన్నీ మ్యూజిక్ థెరపీ, యోగా, సహజ వనరుల పరిరక్షణ ప్రాముఖ్యతను గ్రహించారు.దాంతో అతని దృష్టి స్వచ్ఛమైన వైద్యం నుంచి పర్యావరణం వైపు మళ్లింది.ఫలితంగా ఈ డాక్టర్ ఇప్పుడు ఫ్రాన్స్‌లో మ్యూజీషియన్, మ్యూజిక్ తెరపిస్ట్, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్ టీచర్, ఆర్ట్ గ్యాలరిస్ట్‌గా పనిచేస్తున్నారు.సంధు గోవాలో మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా మొదటిసారిగా పరిచయమైన ఫ్రెంచ్ ఆర్టిస్ట్‌ను పెళ్లి చేసుకున్నారు.2013లో ఫ్రాన్స్‌కు వెళ్లిన అతను ప్రతి సంవత్సరం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకోవడానికి, పర్యావరణం గురించి అవగాహన పెంచడానికి పంజాబ్‌ రాష్ట్రానికి వస్తుంటారు.

Telugu Sunny Sandhu, France Nri, Musictherapist, Nri, Nrimusic, Punjab, Save-Tel

పంజాబ్‌లోని నదీ జలాల దోపిడీపై సంధు ఎప్పటినుంచో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.సహజ వనరులను పరిరక్షించడం ఎంత ముఖ్యమో తన వంతు ప్రచారం చేస్తున్నారు.పర్యావరణ ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యేలా కళాత్మక, పర్యావరణ శాస్త్ర ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు.సంధు బియాస్ నది ఒడ్డున ఉన్న పాఠశాల విద్యార్థులకు వారి పర్యావరణ వారసత్వాన్ని అర్థం చేసుకోవడంలో వారికి సహాయం చేస్తున్నారు.

Telugu Sunny Sandhu, France Nri, Musictherapist, Nri, Nrimusic, Punjab, Save-Tel

తన MBBS పూర్తి చేసిన తర్వాత, సంధు 2007 నుంచి 2011 వరకు కేరళలోని సూర్యాయోగ్ ఫౌండేషన్‌లో ఆయుర్వేదం, ప్రకృతివైద్యం, ధ్యానం, యోగాను అభ్యసించారు.అతను 2009-2011 వరకు ఉస్తాద్ అసద్ అలీ ఖాన్ వద్ద ధృపద్‌ను కూడా నేర్చుకున్నారు.పంజాబ్‌లో రివర్ డాల్ఫిన్ సంరక్షణ, విద్య కోసం భూమిత్ర ప్రాజెక్టును సంధు ప్రారంభించారు.ఇకపోతే ఎన్విరాన్‌మెంట్‌కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అదే మనల్ని కాపాడుతుందని, లేదంటే మనుగడ కష్టమవుతుందని ఆయన భారత ప్రజలకు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube