పవన్ రాజకీయాల కంటే సినిమాలకే ఎక్కువ సమయం.. ఫ్యాన్స్ పుల్‌ హ్యాపీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలం లో రాజకీయాల కంటే ఎక్కువగా సినిమా లపై ఫోకస్ పెడుతున్నట్లుగా అనిపిస్తుంది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉన్నాయి.

 Pawan Kalyan Spending Time For More To Movies Than Politics,pawan Kalyan,janasen-TeluguStop.com

ఎన్నికలకు సమయం ఉంది కనుక ఈ లోపు హడావిడిగా తాను కమిట్ అయిన సినిమాలు అన్నింటిని పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకే హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరణ లో పాల్గొంటూనే మరో వైపు సాహూ సుజిత్ దర్శకత్వం లో సినిమా కు మరియు వినోదయ సీతమ్‌ సినిమా రీమేక్ చిత్రీకరణ లో పాల్గొంటున్నాడు.

ఇలా కమిట్ అయిన అన్ని సినిమాల యొక్క చిత్రీకరణలో సమయం ఉన్నప్పుడల్లా పాల్గొంటూ ఆ సినిమాల చిత్రీకరణ పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ ఉండబోతున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఈ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ నుండి కనీసం రెండు సినిమాలైన విడుదల అయ్యే అవకాశం ఉంది.ఇక వచ్చే ఏడాది మరో రెండు సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.

మొత్తానికి పవన్ కళ్యాణ్ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్న నేపథ్యం లో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాల కంటే కూడా ఎక్కువగా ఈ మధ్య కాలం లో సినిమా లకు పవన్ కళ్యాణ్ సమయం కేటాయించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ముందు ముందు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమా లు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.మరి వచ్చే సంవత్సరం ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుంది.

ఆ తర్వాత ఎలా ఉంటుంది, సినిమా లలో ఎలా చేస్తాడు అనేది చూడాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube