అమరావతి ఇష్యూలో కొత్త మలుపు: అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ వేసిన ఎన్నారై

ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు చోట్ల వికేంద్రీకరించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన మొదలు నేటి వరకు అమరావతి ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.

ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇతర పార్టీలు రైతులకు మద్ధతు తెలుపుతున్నాయి.

ఇదే సమయంలో రాజధానిని మూడు చోట్ల ఏర్పాటు చేసేందుకు రూపొందించిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.అయితే మండలిలో అధికార పార్టీకి ఊహించని షాక్ తగిలింది.

బిల్లును తెలుగుదేశం పార్టీ తనకున్న మద్ధతుతో అడ్డుకుని సెలక్ట్ కమిటీకి పంపేలా చేసింది.అయితే రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు అయినప్పటికీ రాజధాని ప్రాంత రైతులు తమ ఆందోళనను విరమించేది లేదని చెబుతున్నారు.

రైతుల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు సైతం నిరసన చేస్తున్నారు.తాజాగా ఓ ప్రవాస భారతీయుడు అమరావతిపై ఏకంగా అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ వేయడం సంచలనం సృష్టించింది.

Advertisement

సదరు ఎన్నారై అమరావతి అంశంతోపాటు మరికొన్ని అంశాల్ని కలిపి ఇంటర్నేషనల్ కోర్టులో పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది.

దీనిపై న్యాయపరమైన ప్రక్రియ ప్రారంభమైంది.ఇందుకు సంబంధించి అంతర్జాతీయ కోర్టు ఓ సీరియల్ నెంబర్ ఇస్తుంది.ఇది కనుక వస్తే, కేసు అధికారికంగా రిజిస్టర్ అయినట్లే.

ఆ తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానానికి చెందిన ప్రతినిధులు.దీనిపై దర్యాప్తు జరిపించి, పిటిషన్‌దారుడి అభ్యంతరాలను లెక్కలోకి తీసుకుంటారు.

ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత కోర్టు విచారణ జరుపుతుంది.అయితే ఇది అనుకున్నంత సులభం కాదు.దీనికి ఓ ఆరు నెలలో, ఏడాదో సమయం పట్టొచ్చు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అయినప్పటికీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు, భారతదేశానికి మాత్రమే పరిమితమైన అమరావతి వివాదం ఇప్పుడు అంతర్జాతీయ కోర్టుకు వెళ్లడం ద్వారా ప్రపంచం దృష్టిని ఏపీవైపు మరల్చవచ్చునని పలువురు న్యాయ నిపుణులు అంటున్నారు.మరోవైపు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళన బుధవారానికి 78వ రోజుకు చేరుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు