బ్యాగ్ నిండా దేశీ స్నాక్స్ అందుకున్న ఎన్నారై దంపతులు.. వారి రియాక్షన్ చూస్తే ఫిదా...

ప్రపంచంలో ఎక్కడా దొరకని టేస్టీ ఫుడ్స్( Tasty Foods ) ఇండియాలో దొరుకుతాయి.మన ఇండియన్ ఫుడ్స్‌కు మించిన ఆహారాలు ఇండియాలో తప్ప వేరే దేశాల్లో పెద్దగా లభించవు ఈ కారణంగా విదేశాల్లో నివసించేవారు ఇండియన్ ఫుడ్ ఎవరైనా తెస్తే బాగుండు అని ఎప్పుడు కోరుకుంటున్నారు.

 Nri Couple Receives Bag Full Of Desi Snacks Watch Video,nri Couple ,indian Food,-TeluguStop.com

లండన్‌( London )లో నివసిస్తున్న కరిష్మా, రికిన్ అనే ఓ ఎన్నారై జంటకు కూడా ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం.అందుకే భారతదేశం( India ) నుంచి వస్తున్న వారి స్నేహితులను కొన్ని భారతీయ మసాలాలు, స్నాక్స్ తీసుకురావాలని వారు కోరారు.

అయితే స్నేహితులు వారిని సర్ ప్రైజ్ చేశారు.అడిగిన వాటికంటే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్( Food Items ) ప్యాక్ చేసి గిఫ్ట్ రూపంలో ఇచ్చారు.ఈ దంపతులు స్నేహితుల నుంచి ఆలూ భుజియా, సేవ్ ఖమ్మి, గరం మసాలా, మ్యాగీ, కుర్కురే, లేస్, కశ్మీరీ రెడ్ చిల్లీ వంటి వాటితో కూడిన సూట్‌కేస్‌ని పొందారు.సూట్‌కేస్‌ను తెరుస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.వారు ఈ దేశీ ఫుడ్స్( Desi Foods ) గిఫ్ట్ గా ఇచ్చినందుకు వారి స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుకున్నారు.“ఆనందంతో నిండిన సూట్‌కేస్” అని పిలిచారు.

ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు.కొంతమంది ఆ జంట భావాలను అర్థం చేసుకుని భారతీయ ఆహారాన్ని కూడా మిస్ అవుతున్నారని చెప్పారు.విదేశాల్లోని భారతీయ స్టోర్లలో ఈ వస్తువులు దొరుకుతాయని కొందరు చెప్పారు.కొంతమంది ఈ జంట ఇండియన్ ఫుడ్( Indian Food ) చూసి ఉత్సాహం వ్యక్తం చేసిన తీరుపై జోకులు వేశారు.

డబ్బు కోసం భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు గా మళ్లీ ఇండియా ఫుడ్ మీకెందుకు అని కొంతమంది విమర్శించారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube